Kangana Ranaut Gets Emotional At Thalaivi Movie Trail Launch Event - Sakshi
Sakshi News home page

బర్త్‌ డే నాడే కన్నీళ్లు పెట్టుకున్న కంగనా

Published Tue, Mar 23 2021 6:36 PM | Last Updated on Tue, Mar 23 2021 7:08 PM

Kangana Ranaut Tears In Thalaivi Movie Trail Launch Event - Sakshi

బాలీవుడ్‌ ఐరన్‌ లేడీగా గుర్తింపు పొందిన కంగనా రనౌత్‌ తన పుట్టిన రోజునే కన్నీళ్లు పెట్టుకుంది. నేను ఎప్పుడు ఏడవను.. నన్ను ఎవరూ ఏడిపించలేరు అనుకుంటూనే ఏడ్చేసింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితం ఆధారంగా రూపొందించిన ‘తలైవి’ ట్రైలర్‌ మంగళవారం (మార్చి 23) విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో కంగనా మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యింది. 

విజయ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘తలైవి’ విశేషాలు పంచుకున్నారు. ఈ క్రమంలో కంగనా మాట్లాడుతూ.. నేను ఎప్పుడు ఏడవను. నన్ను ఏడిపించే హక్కు ఎవరికీ ఇవ్వను. నేను చివరిగా ఏడ్చిందెప్పుడో కూడా గుర్తులేదు. కానీ ఈ రోజు నేను ఏడ్చాను. ఇప్పుడు మనసు తేలికగా ఉంది’ అని చెప్పి ప్రసంగం ముగించేసి వెళ్లిపోయింది.

అంతకుముందు దర్శకుడు విజయ్‌ గురించి కంగనా రనౌత్‌ మాట్లాడుతూ.. ‘నేను ఒకరికి కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నా. అతడు నాపై నాకు నమ్మకం కలిగేలా చేశారు. సినిమా సెట్లో ఒక హీరోతో ఉన్నంత చనువుగా ఒక నటితో ఎవరూ ఉండరు. కానీ అతడిని చూసి నటీనటులతో ఎలా వ్యవహరించాలనే విషయం తెలుసుకున్నా’ అని తెలిపింది. కాగా సోమవారమే కంగనా బర్త్‌ డే గిఫ్ట్‌ అందుకుంది. జాతీయ సినిమా అవార్డుల్లో కంగనా ఉత్తమ నటి అవార్డు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

చదవండి: ఫుల్‌ ఖుషీలో బాలీవుడ్‌ ఐరన్‌ లేడీ
చదవండి: దుమ్మురేపిన మహేశ్‌బాబు, నాని
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement