![Kangana Ranaut pays tribute to late Jayalalitha - Sakshi](/styles/webp/s3/article_images/2020/12/6/kangana.jpg.webp?itok=w5MjvwEf)
డిసెంబర్ 4 నటి, రాజకీయ నాయకురాలు జయలలిత వర్ధంతి. ఆమె జీవితం ఆధారంగా తమిళంలో పలు చిత్రాలు తెరకెక్కుతున్నాయి. వాటిలో కంగనా రనౌత్ లీడ్ రోల్ చేస్తున్న చిత్రం ‘తలైవి’ ఒకటి. ఏఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. జయలలిత వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాల వేసి, నివాళి అర్పించారు కంగనా. అలానే ‘తలైవి’ సినిమాలోని పలు వర్కింగ్ స్టిల్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ‘‘ప్రపంచం నటీమణులను చూసే దృష్టి కోణాన్నే మార్చేసిన నటి జయమ్మ.
అలాంటి గొప్ప నటికి, విప్లవ నాయకురాలికి నివాళి అర్పించడం చాలా సంతోషంగాను, గర్వంగానూ ఉంది. ఫెమినిటీని (స్త్రీత్వం) గౌరవిద్దాం’’ అంటూ నివాళి అర్పించే ఫోటోను షేర్ చేశారు కంగనా రనౌత్. అలానే సినిమా గురించి మాట్లాడుతూ– ‘‘తలైవి’ సినిమా అనుకున్నట్టే వస్తోంది. దీనికి కారణం మా టీమ్. మా టీమ్ లీడర్ ఏఎల్ విజయ్‌కి చాలా థ్యాంక్స్. ఈ సినిమాను అద్భుతంగా మలచడం కోసం నిరంతరం సూపర్‌మేన్‌లా పని చేస్తున్నారు. ఇంకో వారం రోజుల్లో సినిమా చిత్రీకరణ పూర్తవుతుంది’’ అన్నారు కంగనా. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment