
సినిమా హీరోయిన్లు శరీరాకృతి విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లుక్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా అది కెరీర్ మీద ప్రభావం చూపిస్తుంది. సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరగిన అనుష్క తరువాత లుక్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా మరో బ్యూటీ అదే రిస్క్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్, జయలలిత బయోపిక్‌లో నటించేందుకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో జయలా కనిపించేందుకు ఆమె చాలా కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటికే తమిళ్ నేర్చుకుంటున్న కంగనా, అదే సమయంలో బరువు కూడా పెరుగుతున్నారట. ఒకసారి బరువు పెరిగితే తగ్గటం చాలా కష్టమని తెలిసినా.. అమ్మ పాత్రకు న్యాయం చేసేందుకు రిస్క్ చేయాలని ఫిక్స్ అయ్యారట కంగనా.
విజయేంద్ర ప్రసాద్ కథ అందిస్తున్న ఈ సినిమాలో ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి, కరుణానిధిగా ప్రకాష్ రాజ్ నటించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ రూపొందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment