జయ బయోపిక్‌ ఆగిపోయిందా? | Kangana Ranaut Jayalalitha Biopic Shelved | Sakshi
Sakshi News home page

జయ బయోపిక్‌ ఆగిపోయిందా?

Published Thu, Sep 12 2019 12:03 PM | Last Updated on Thu, Sep 12 2019 12:03 PM

Kangana Ranaut Jayalalitha Biopic Shelved - Sakshi

మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత మరణం తరువాత ఆమె బయోపిక్‌ను తెరకెక్కించేందుకు చాలా మంది నిర్మాతలు ముందుకు వచ్చారు. ఇప్పటికే ప్రముఖ దర్శకుడు జయలలిత కథతో క్వీన్‌ పేరుతో వెబ్‌ సిరీస్‌ ప్రారంభించారు. అదే సమయంలో బాలీవుడ్‌ సంచలన నటి కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రలో తలైవీ పేరుతో జయలలిత బయోపిక్‌ను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు.

అంతేకాదు కంగనా కూడా జయ పాత్రలో ఒదిగిపోయేందుకు తమిళ్‌ నేర్చుకోవటంతో పాటు బరువు పెరిగేందుకు కూడా రెడీ అయ్యారు. ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో 50 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కించాలని నిర్ణయించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. అధికారికంగా ప్రకటించ‍కపోయినా ఆర్థిక సమస్యల కారణంగానే ప్రాజెక్ట్‌ను వాయిదా వేసినట్టుగా ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement