కోవిడ్ సమయంలో ముస్లింల మనోభావాలు దెబ్బతీసినందుకు శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా వారికి క్షమాపణలు చెప్పింది. కరోనా బారినపడి మృతి చెందిన ముస్లింలను బలవంతంగా దహనం చేసినందుకు తమను క్షమించాలని, భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగబోవని ప్రభుత్వం ముస్లింలకు భరోసా ఇచ్చింది.
భవిష్యత్తులో ముస్లింలు లేదా మరే ఇతర కమ్యూనిటీ ప్రజలు అనుసరించే అంత్యక్రియల ఆచారాల విషయంలో ఉల్లంఘన జరగకుండా చూస్తామని ప్రభుత్వం పేర్కొంది. ఖననం లేదా దహన సంస్కారాలకు సంబంధించిన విషయంలో కొత్త చట్టం హామీ ఇస్తుందని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని శ్రీలంక సభలోని ముస్లిం ప్రతినిధులు స్వాగతించారు. దేశ జనాభాలో ముస్లిం జనాభా 10 శాతం అని, కోవిడ్ కాలంలో జరిగిన ఘటనలపై ముస్లింలు ఇప్పటికీ ఆవేదన చెందుతున్నారని ముస్లిం ప్రతినిధులు పేర్కొన్నారు.
కోవిడ్ కాలంలో శ్రీలంక ప్రభుత్వం కరోనా మృతులను ఖననం చేసేందుకు అనుమతించలేదు. దీనికి సంబంధించి శ్రీలంక ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి కూడా విమర్శించింది. ముస్లింలు, కాథలిక్కులు, బౌద్ధుల మనోభావాలను గౌరవించడంలో శ్రీలంక ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు గతంలో వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment