కేంద్రం నిర్ణయంపై ముస్లిం మహిళల హర్షం
ముస్లిం మహిళా సోషల్ యాక్టివిస్ట్ మరియా ఆలం మీడియాతో మాట్లాడుతూ కేంద్రం నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కేవలం ట్రిపుల్ తలాక్ విధానాన్నే కాకుండా.. ముస్లిం పర్సనల్ లా బోర్డ్(పీఎల్‌బీ) ను కూడా రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. షరియాలో ఉన్న చిక్కులను వివరించేందుకు ఏర్పాటైన పీఎల్‌బీ పురుష పక్షపాతిగా వ్యవహరిస్తుందని ఆమె ఆరోపించారు. ఖురాన్ ప్రకారం ముస్లిం మహిళలకు పురుషులతో పాటు సమాన హక్కులు ఉన్నాయన్నారు. షాజియా సిద్దిఖీ అనే మరో మహిళ మాట్లాడుతూ.. 'ట్రిపుల్ తలాక్ వివక్షతో కూడినది. దీనిని తొలగించాల్సిందే. మూడు పదాలతో వివాహానికి ముగింపు పలికి.. మహిళల జీవితాలను నాశనం చేసే హక్కు ఉండరాదు' అన్నారు. పలు ముస్లిం దేశాలు ఇప్పటికే ట్రిపుల్ తాలక్ విధానాన్ని రద్దు చేశాయని ఆమె గుర్తుచేశారు.