
చలి చంపేస్తోంది..
చలి పులి పంజా విసురుతోంది. పల్లెలు శీతగాలులకు వణుకుతున్నాయి. తెల్లవారి 9 గంటలైనా మంచుదుప్పటి తొలగిపోవడం లేదు. దట్టంగా కమ్ముకుంటున్న పొగమంచుతో ఉదయం వేళల్లో రాకపోకలకు విఘాతం కలుగుతోంది. ఇక, గ్రామాల్లో జనం మంటలు కాచుకుని చలి బారి నుంచి కాపాడుకుంటున్నారు. ఉదయం 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి బయటకు వెళ్లాలంటే స్వెట్టర్లు, మంకీక్యాప్‌లు ధరించి బయటకు వెళ్తున్నారు. పిల్లలు, వృద్ధులు చలిగాలులతో ఇబ్బందులు పడుతున్నారు.
- నారాయణఖేడ్/న్యాల్‌కల్