
న్యూఢిల్లీ: ఇటీవల బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్ ఆలయంపై జరిగిన దాడి వార్త ప్రధాన శీర్షికల్లో నిలిచింది. అలాగే ఇస్కాన్‌కు చెందిన సన్యాసి చిన్మయ్ కృష్ణదాస్‌ను బంగ్లాదేశ్ ప్రభుత్వం అరెస్టు చేయడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఆగ్రహం తెప్పించింది. ఈ నేపధ్యంలో చాలాచోట్ల ఇస్కాన్ దేవాలయానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇంతకీ ఇస్కాన్‌ను ఎవరు నెలకొల్పారు? ఈ సంస్థ లక్ష్యమేమిటి?
కృష్ణ భక్తికి ప్రసిద్ధి చెందిన ఇస్కాన్ దేవాలయాలకు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఇస్కాన్ అంటే ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్. దీనిని 1966లో శ్రీల ప్రభుపాద స్థాపించారు. ఆయన కోల్‌కతాలో జన్మించారు. తనకున్న అపార శ్రీకృష్ణ భక్తిని పరివ్యాప్తం చేస్తూ 1965లో హరే కృష్ణ ఉద్యమాన్ని ప్రారంభించారు. భగవద్గీతతో పాటు వేద గ్రంథాలలోని ఆధ్యాత్మికతను, భక్తిని వ్యాప్తి చేయడమే హరే కృష్ణ ఉద్యమ లక్ష్యం.
శ్రీల ప్రభుపాద ఉద్యోగం నుంచి పదవీ విరమణ చేసిన తర్వాత ‘హరే కృష్ణ, హరే రామ్’ అంటూ శ్రీకృష్ణ భక్తిని ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం చేశారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వెయ్యికిపైగా ఇస్కాన్ దేవాలయాలు ఉన్నాయి. వీటిలోని కొన్ని ఆలయాలు అక్కడి వాస్తుశిల్ప కళకు ప్రసిద్ధి చెందాయి. లండన్, బెర్లిన్, న్యూయార్క్‌లలో లెక్కకు మించిన కృష్ణ భక్తులు కనిపిస్తారు. వీరిలో చాలామంది క్రమం తప్పకుండా ఇస్కాన్‌ను సందర్శిస్తారు. ఇస్కాన్ దేవాలయాల్లో మనోహరమైన రాధాకృష్ణుల విగ్రహాలు కనిపిస్తాయి.
ఇస్కాన్ ఆలయాల్లో ప్రతి రోజూ హరినామ సంకీర్తన జరుగుతుంది. ఆలయానికి వచ్చే భక్తులకు ఉచితంగా ప్రసాదం అందజేస్తారు. ఇస్కాన్ దేవాలయాలలో శ్రీమద్ భాగవతం, భగవద్గీతలపై బోధనలు ఉంటాయి. ఇస్కాన్ ప్రధాన కార్యాలయం మాయాపూర్ (పశ్చిమ బెంగాల్)లో ఉంది. ఇక్కడి భక్తులు శ్రీ చైతన్య మహాప్రభు అందించిన సూత్రాలను పాటిస్తారు.
ఇది కూడా చదవండి: మహా కుంభమేళాకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ఏర్పాట్లు.. టిక్కెట్ల బుకింగ్ షురూ
Comments
Please login to add a commentAdd a comment