iskcon organization
-
Viral: ప్రపంచంలోనే అతిపెద్ద ఆలయం మన దేశంలోనే.. ఎక్కడంటే?
భిన్నమైన నిర్మాణ శైలితో, తెలుపు, నీలం రంగుల్లో కాంతులీనుతూ కనిపిస్తున్న ఈ భవనం ఎంత అద్భుతంగా ఉందో కదా! ఈ అపూర్వమైన నిర్మాణం మన ఇండియాలోనిదే. పశ్చిమబెంగాల్లోని మాయాపూర్‌లోని నిర్మితమవుతున్న వేదిక్ ప్లానిటోరియం టెంపుల్. ఇస్కాన్ సంస్థ నిర్మిస్తున్న ఈ ఆలయ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.. ప్రపంచంలోనే అతిపెద్దదిగా అవతరించబోతున్న ఈ ఆలయ ఫొటోలను ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ (ఇస్కాన్) సంస్థ నిర్వాహకులు ఇటీవలే ట్విట్టర్లో షేర్ చేశారు. 2010లో మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టు విలువ వంద మిలియన్ డాలర్లట. విశ్వంలోని వివిధ గ్రహాల కదలికలకు ప్రతీకగా ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారట. వేదాల ప్రకారం విశ్వం గురించి, ఇతర పురాణ కథల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. దేశంలోని ఐకానిక్ భవనాల జాబితాలో చేరనున్న ఈ ఆలయం.. వాటికన్లోని సెయింట్‌పాల్ కేథడ్రల్ కంటే, ఆగ్రాలోని తాజ్‌మహల్ కంటే పెద్దది. ఆలయ డోమ్ సైతం ప్రపంచంలోనే అతి పెద్దది. ఇకనుంచి ఇస్కాన్ సంస్థ ప్రధాన కేంద్రంగా పనిచేయనున్నది. అంతేకాదు ఒకేసారి 10వేల మంది భక్తులకు వసతి కల్పించే సామర్థ్యం కలిగి ఉందట. దీని నిర్మాణ వ్యవహారాలన్ని వ్యాపార దిగ్గజం హెన్రీఫోర్డ్ మనవడైన ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ చూసుకుంటున్నారు. ప్రస్తుతం అంబరీష్ దాస్‌గా పేరు మార్చుకున్న ఆయన ఇస్కాన్ భక్తుడు. ఈ అద్భుతాన్ని వెంటనే చూడాలనిపిస్తోంది కదా... అయితే 2024 దాకా ఆగాల్సిందే. 2022నాటికే ఇది ప్రారంభం కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా రెండేండ్లు ఆలస్యమయిందని ఇస్కాన్ నిర్వాహకులు తెలిపారు. సాధారణ వ్యక్తులనే ఆకట్టుకుంటున్న ఈ నిర్మాణం పూర్తవ్వడంకోసం కృష్ణుడి భక్తులు ఉత్సాహంగా ఎదురుచూస్తారనడంలో సందేహమే లేదు. -
పస్తులున్నా పట్టించుకోరా!
పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు పౌష్టికాహారాన్ని అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఆకుకూరలతోపాటు కోడ్డిగుడ్డును అందించి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే లక్ష్యానికి ఇస్కాన్ తూట్లు పొడుస్తోంది. పరిస్థితి ఇంతలా ఉన్నా.. పస్తులుండి నిరసన తెలిపినా పట్టించుకోరా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. కడప ఎడ్యుకేషన్: కడప మండలంలోని పలు పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించే బాధ్యతను ప్రభుత్వం ‘ఇస్కాన్’ సంస్థకు అప్పగిం చింది. విద్యార్థులకు ఇస్కాన్ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీం తో పాటు ఇస్కాన్ వారు భో జనంలో మెనూ పాటించిన దాఖలాలు లేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చప్పిడి సాంబా రు, నీళ్ల పప్పు.. ముద్దకట్టిన అన్నాన్ని తినలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దీంతో చాలా మంది ఇళ్ల నుంచి క్యారియర్లు తెచ్చుకుంటున్న పరిస్థితి దాపురించింది. ఈ భోజనం ‘మాకొద్దు’: ఇస్కాన్ భోజనాన్ని తినలేక కడప నగరంలోని కొండాయపల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అక్టోబర్ 30న డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తర్వాత అక్టోబర్ 31, నవంబర్ 1న పాఠశాలలకు తీసుకొచ్చిన అన్నాన్ని తినకుండా భోజన వ్యాన్‌ను వెనక్కు పంపి పస్తులున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా.. పస్తులుండి నిరసన తెలిపినా çపట్టించుకునే వారే లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒక్క కొండాయపల్లె పాఠశాల నుంచేగాక ఇతర పాఠశాలల నుంచి కూడా ఇస్కాన్ భోజనం బాగా లేదని అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. -
సంకీర్తన దండియాత్ర ప్రారంభం
సాక్షి, ముంబై: విలేపార్లేలోని ప్రముఖ ఇస్కాన్ సంస్థకు చెందిన సుమారు 1,500 మంది భక్తులు సంకీర్తన దండి యాత్ర ప్రారంభించారు. ఇందులోభాగంగా ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రలోని అనేక పుణ్యక్షేత్రాలను సందర్శించారు. శ్రీకృష్ణ చైతన్యస్వామి రాష్ట్రాన్ని సందర్శించి ఈ సంవత్సరంతో 500 ఏళ్లు పూర్తయ్యింది. ఈసందర్భాన్ని పురస్కరించుకుని స్వామి నడిచిన మార్గంలో పయనించాలనే లక్ష్యంతో ఈ యాత్రకు శ్రీకారం చుట్టినట్లు నిర్వాహకులు చెప్పారు. గత నెల 29వ తేదీన కొల్హాపూర్‌లోని ఇస్కాన్ మందిరం నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో భాగంగా వీరంతా పండరీపూర్‌లోని విఠలుడిని దర్శించుకున్నారు. ఆ తరువాత పుణే. సాతారాల మీదుగా నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ ఆలయాన్ని దర్శించుకుని మళ్లీ ఈ నెల 22న సాతారాలో ఇస్కాన్ మందిరానికి చేరుకుంటారు. ఈ యా త్రలో భాగంగా ఈ భక్త బందం దాదాపు 386 కి.మీ. కాలినడకన పయనిస్తుంది.