నిరసన వ్యక్తం చేస్తున్న కొండాయపల్లె విద్యార్థులు (ఇన్‌సెట్) గడ్డలు గడ్డ్డలుగా ఉన్న అన్నం, నీళ్లు నీళ్లుగా కూర
పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు పౌష్టికాహారాన్ని అందించాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతోంది. ఆకుకూరలతోపాటు కోడ్డిగుడ్డును అందించి విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే లక్ష్యానికి ఇస్కాన్ తూట్లు పొడుస్తోంది. పరిస్థితి ఇంతలా ఉన్నా.. పస్తులుండి నిరసన తెలిపినా పట్టించుకోరా అని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు.
కడప ఎడ్యుకేషన్: కడప మండలంలోని పలు పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డించే బాధ్యతను ప్రభుత్వం ‘ఇస్కాన్’ సంస్థకు అప్పగిం చింది. విద్యార్థులకు ఇస్కాన్ సరఫరా చేస్తున్న మధ్యాహ్న భోజనంలో నాణ్యత లేదని తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. దీం తో పాటు ఇస్కాన్ వారు భో జనంలో మెనూ పాటించిన దాఖలాలు లేవని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. చప్పిడి సాంబా రు, నీళ్ల పప్పు.. ముద్దకట్టిన అన్నాన్ని తినలేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దీంతో చాలా మంది ఇళ్ల నుంచి క్యారియర్లు తెచ్చుకుంటున్న పరిస్థితి దాపురించింది.
ఈ భోజనం ‘మాకొద్దు’: ఇస్కాన్ భోజనాన్ని తినలేక కడప నగరంలోని కొండాయపల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థులు అక్టోబర్ 30న డీఈఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తర్వాత అక్టోబర్ 31, నవంబర్ 1న పాఠశాలలకు తీసుకొచ్చిన అన్నాన్ని తినకుండా భోజన వ్యాన్‌ను వెనక్కు పంపి పస్తులున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా.. పస్తులుండి నిరసన తెలిపినా çపట్టించుకునే వారే లేరని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒక్క కొండాయపల్లె పాఠశాల నుంచేగాక ఇతర పాఠశాలల నుంచి కూడా ఇస్కాన్ భోజనం బాగా లేదని అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి.
Comments
Please login to add a commentAdd a comment