మాస్కో: భార్య-భర్తల మధ్య గొడవలు కామన్. కానీ చిన్నగా మొదలైన గొడవ కాస్త చిలికి చిలికి పెద్దవానగా మారితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. తాజాగా ఇద్దరు దంపతులు గొడవ పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ ప్రాంతానికి చెందిన ఓ అపార్ట్ మెంట్ లో భార్యభర్తలు ఓల్గా వోల్కోవా, కార్లాగిన్ నివాసం ఉంటున్నారు. అయితే అపార్ట్ మెంట్ లోని రెండో అంతస్తులో ఉన్న దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్త ముదరడంతో ఇద్దరు తన్నుకునేదాకా వెళ్లింది. అయితే ఆ గొడవ శృతిమించడంతో అదుపు తప్పి బాల్కనీ నుంచి జారి కిందపడ్డారు.
అదే సమయంలో ఆఫీస్కు వెళుతున్న డెనీస్.. వారిని కాపాడేందుకు పడిపోతున్నారు పట్టుకోండి పట్టుకోండని కేకలు వేశాడు. అతని స్నేహితుడు జారి పడుతున్న బాధితుల్ని వీడియోలు తీయడంతో, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా డెనీస్ మాట్లాడుతూ భార్యాభర్తలు ఏదో విషయంపై గొడవ పడినట్లున్నారు. కిందపడిన వాళ్లిద్దరిని కాపాడేందుకు డాక్టర్లు ఎవరైనా ఉన్నారేమోనని ఆరా తీశాం. అంతలోనే అంబులెన్స్ వచ్చింది. ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ ఉందంటూ స్థానిక మీడియాకు వెల్లడించాడు.
చదవండి : పెళ్లి కూతురు సిగ్గు, పర్ఫామెన్స్ ఇరగదీస్తున‍్న పెళ్లికొడుకు
Comments
Please login to add a commentAdd a comment