balcony collapse
-
భార్యాభర్తలు పడిపోతున్నారు.. పట్టుకోండి పట్టుకోండి
మాస్కో: భార్య-భర్తల మధ్య గొడవలు కామన్. కానీ చిన్నగా మొదలైన గొడవ కాస్త చిలికి చిలికి పెద్దవానగా మారితే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. తాజాగా ఇద్దరు దంపతులు గొడవ పడి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ ప్రాంతానికి చెందిన ఓ అపార్ట్ మెంట్ లో భార్యభర్తలు ఓల్గా వోల్కోవా, కార్లాగిన్ నివాసం ఉంటున్నారు. అయితే అపార్ట్ మెంట్ లోని రెండో అంతస్తులో ఉన్న దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. అదికాస్త ముదరడంతో ఇద్దరు తన్నుకునేదాకా వెళ్లింది. అయితే ఆ గొడవ శృతిమించడంతో అదుపు తప్పి బాల్కనీ నుంచి జారి కిందపడ్డారు. అదే సమయంలో ఆఫీస్‌కు వెళుతున్న డెనీస్.. వారిని కాపాడేందుకు పడిపోతున్నారు పట్టుకోండి పట్టుకోండని కేకలు వేశాడు. అతని స్నేహితుడు జారి పడుతున్న బాధితుల్ని వీడియోలు తీయడంతో, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ సందర్భంగా డెనీస్ మాట్లాడుతూ భార్యాభర్తలు ఏదో విషయంపై గొడవ పడినట్లున్నారు. కిందపడిన వాళ్లిద్దరిని కాపాడేందుకు డాక్టర్లు ఎవరైనా ఉన్నారేమోనని ఆరా తీశాం. అంతలోనే అంబులెన్స్ వచ్చింది. ఆస్పత్రికి తరలించాం. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ ఉందంటూ స్థానిక మీడియాకు వెల్లడించాడు. చదవండి : పెళ్లి కూతురు సిగ్గు, పర్ఫామెన్స్ ఇరగదీస్తున్న పెళ్లికొడుకు -
'టౌటే'తో బాల్కనీ పైకప్పు కూలిపోయింది: నటి
ముంబై : ఓ వైపు కరోనా సెకండ్‌వేవ్‌తో ప్రజలు అల్లాడుతుంటే టౌటే తుఫాన్ మరింత కష్టాలు తెచ్చిపెట్టింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ప్రారంభమైన టౌటే తుపాను ధాటికి ముంబై సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ నష్టం సంభవించింది. మే నెలలో అత్యధికంగా 24 గంటల వ్యవధిలో 230 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. భారీ వర్షం కారణంగా ముంబైలోని వివిధ ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి.. వీధులు నీటితో నిండిపోయాయి. తుపాను ప్రభావంతో అనేక చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలడంతో ముంబైలోని అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చాలా ఇళ్లల్లో టీవీలు, ఇంటర్నెట్ కనెక్షన్లు పనిచేయడం లేదు. ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు మూసివేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఇంటి నుంచి పనిచేసే (వర్క్ ఫ్రం హోమ్) ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక టౌటే తుపాను తనకు కూడా ఎంతో నష్టం కలిగించిందని నటి రాఖీ సావంత్ తెలిపారు. ముంబైలో కురిసిన భారీ వర్షాలకు తన ఇంటి బాల్కనీ పైకప్పు కుప్పకూలిపోయిందని వెల్లడించారు. ఇది చూసి తానెంతో బాధపడుతున్నానని, నిన్నటి నుంచి పైకప్పు నుంచి పడుతున్న వర్షపు నీటిని బకెట్‌తో బయట పారబోశానని తెలిపింది. అంతేకాకుండా తుపాను ధాటికి చెట్లు విరిగిపోవడం గురించి స్పందిస్తూ.. ఇప్పటికే ప్రజలు ఆక్సిజన్ సిలిండర్లు లేక ప్రాణాలు కోల్పోతుంటే ఇలా చెట్లు విరిగిపోతే మనకు ప్రాణవాయువు ఎక్కడినుంచి వస్తుంది? ఇంకా దేవుడు ఏమేం చేయాలనుకుంటున్నాడో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక టౌటే తుపాను మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టించింది. తుపాను ప్రభావంతో ఇప్పటికి 100 మంది వరకు గల్లంతయినట్టు సమాచారం. ప్రస్తుతం అతి తీవ్ర తుపానుగా ఉన్న టౌటే మరికొద్ది గంటల్లో బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. చదవండి : ఐటెం గర్ల్ అయినందుకు ఎలాంటి బాధ లేదు: రాఖీ సావంత్ Amitabh Bachchan: ఆఫీసును ముంచెత్తిన వరద -
పార్టీలో ఉండగా.. విషాదం
బర్కేలీ: నిర్లక్ష్యంగా నిర్మించిన భవనం విద్యార్థుల ప్రాణం బలిగొంది. ఐర్లాండ్ నుంచి చదువుకునేందుకు అమెరికాకు వచ్చిన ఆరుగురు విద్యార్థులు ప్రాణాలుకోల్పోయారు. తాము ఉంటున్న భవనంలోని పై కప్పు కూలిపోయి వారు మృతి చెందారు. పుచ్చిపోయిన కర్రదుంగలతో గోడలు నిర్మించి బాల్కనీ నిర్మించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. ఐర్లాండ్‌కు చెందిన కొందరు విద్యార్థులు బెర్కేలీ పట్టణంలో చదువుకునేందుకు వచ్చారు. అక్కడే ఓ ఇళ్లు తీసుకుని ఉంటున్నారు. కాగా వారిలో ఒకరి పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులంతా వచ్చి ఆడి పాడుతుండగా.. ఒక్కసారిగా బాల్కనీ కూలిపోయింది. దీంతో దాదాపు 13 మంది విద్యార్థులు దానికిందపడిపోయారు. వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బాల్కనీకి ఉపయోగించిన చెక్కలు సరిగా అమర్చకపోవడం, సీల్ చేయకపోవడం, క్రిమికీటకాలకు గురికావడం పుచ్చిపోయి కూలిపోయినట్లు వారు వెల్లడించారు.