పార్టీలో ఉండగా.. విషాదం | Deadly balcony collapse tied to rotted wooden beams | Sakshi
Sakshi News home page

పార్టీలో ఉండగా.. విషాదం

Published Thu, Jun 18 2015 9:19 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

పార్టీలో ఉండగా.. విషాదం - Sakshi

పార్టీలో ఉండగా.. విషాదం

బర్కేలీ: నిర్లక్ష్యంగా నిర్మించిన భవనం విద్యార్థుల ప్రాణం బలిగొంది. ఐర్లాండ్ నుంచి చదువుకునేందుకు అమెరికాకు వచ్చిన ఆరుగురు విద్యార్థులు ప్రాణాలుకోల్పోయారు. తాము ఉంటున్న భవనంలోని పై కప్పు కూలిపోయి వారు మృతి చెందారు. పుచ్చిపోయిన కర్రదుంగలతో గోడలు నిర్మించి బాల్కనీ నిర్మించడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని అధికారులు వెల్లడించారు. ఐర్లాండ్కు చెందిన కొందరు విద్యార్థులు బెర్కేలీ పట్టణంలో చదువుకునేందుకు వచ్చారు. అక్కడే ఓ ఇళ్లు తీసుకుని ఉంటున్నారు.

కాగా వారిలో ఒకరి పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులంతా వచ్చి ఆడి పాడుతుండగా.. ఒక్కసారిగా బాల్కనీ కూలిపోయింది. దీంతో దాదాపు 13 మంది విద్యార్థులు దానికిందపడిపోయారు. వారిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. బాల్కనీకి ఉపయోగించిన చెక్కలు సరిగా అమర్చకపోవడం, సీల్ చేయకపోవడం, క్రిమికీటకాలకు గురికావడం పుచ్చిపోయి కూలిపోయినట్లు వారు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement