వైరల్‌: జుట్టు పట్టుకుని కొట్టుకున్న యువతులు | Viral Video: 2 Girls Fight Violently In Middle of The Road | Sakshi
Sakshi News home page

మురికి కాలువలో పడ్డా ఫైటింగ్‌ ఆపని యువతులు

Published Thu, Apr 8 2021 8:11 PM | Last Updated on Tue, Oct 5 2021 6:58 PM

Viral Video: 2 Girls Fight Violently In Middle of The Road - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మూడు గుండ్లు ఒక దగ్గర ఉండగలవేమోగాని రెండు సిగలు మాత్రం ఒక దగ్గర ఉండలేవు.. అన్న మాటకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచిందీ ఘటన. నడిరోడ్డు మీద జుట్టుపట్టుకుని మరీ కొట్టుకున్నారు ఇద్దరు అమ్మాయిలు. చివరికి డ్రైనేజీలో పడినా కూడా అదేం పట్టించుకోకుండా బాదుడు మీదే ప్రత్యేకంగా దృష్టి పెట్టారిద్దరూ. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగిందన్న వివరాలు తెలియరాలేదు, కానీ దీనికి సంబంధించిన వీడియో మాత్రం సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.

ఇందులో జీన్స్‌ ధరించిన ఇద్దరు యువతులు కోపంతో ఊగిపోతూ ఒకరినొకరు చితక్కొట్టుకున్నారు. ఒకరు తోసేస్తుంటే మరొకరేమో జుట్టు పట్టుకుని లాగుతూ ఆమె వీపు మీద పిడిగుద్దులు కురిపిస్తున్నారు. ఈ ఘర్షణలో వారు ఒకరినొకరు తోసుకుంటూ మురికి కాలువలో పడ్డారు. చేతికి, శరీరానికి అంతటికీ మురికి నీరు అంటినా వారు మాత్రం కొట్టుకోవడంలోనే నిమగ్నమయ్యారు. అడ్డొస్తే తమను కూడా కొడతారని భావించారే ఏమో కానీ.. అక్కడున్న స్థానిక జనాలు వారిని శాంతింపజేసేందుకు ప్రయత్నించకపోవడం గమనార్హం. ఈ వీడియో చూసిన జనాలు ఛీ ఛీ.. మరీ మురికి గుంటలో పడ్డాం అన్న స్పృహ లేకుండా ఆ కొట్టుకోవడం ఏంట్రా నాయనా! అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మీ ముందు రెజ్లర్లు కూడా పనికి రారు తల్లో.. అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

చదవండి: సూపర్‌ మార్కెట్‌లోకి అనుకోని అతిథి.. జనం హడల్‌

పెళ్లి కోసం ఐదేళ్లుగా ఆరాటం: మొత్తానికి నిశ్చితార్థం..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement