Girls Fight On Road Viral Video: Crazy Young Girls Fighting In Middle Of The Road - Sakshi
Sakshi News home page

రోడ్డుపై చితకొట్టుకున్న యువతులు... వైరల్‌ వీడియో..

Published Fri, Jul 9 2021 7:40 PM | Last Updated on Sun, Jul 11 2021 12:26 PM

Viral Video: Crazy Fight Breaks Between Girls On Road As They Kick Each Other  - Sakshi

Girls Fighting On Road Video: ఈ మధ్య కాలంలో సోషల్‌ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్‌ గా మారుతున్నాయి. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని వెరైటీగానూ ఉంటున్నాయి. తాజాగా, ముగ్గురు యువతులు రోడ్డుపక్కన కొట్టుకుంటున్న వెరైటీ వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీంట్లో, ముగ్గురు యువతులు రోడ్డుపక్కన నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరికి మరో యువతి ఎదురుగా వచ్చింది. అప్పటి వరకు బాగానే ఉన్నా... ఇద్దరు యువతులు మూడో యువతిపై దాడికి పాల్పడి, కోపంతో ఇష్టమొచ్చినట్టు కొడుతున్నారు.

మొదట ఆ యువతి షాక్‌కు గురయ్యింది. ఆ తర్వాత వెంటనే తెరుకుని ఆమె కూడా ఇద్దరిని తిరిగి కొట్టడం మొదలుపెట్టింది. అక్కడ ఉన్నవారంతా, వీరిని గొడవను వింతగా చూస్తున్నారు. కొంత మంది వీడియో తీస్తూ నిలబడ్డారు. కానీ ఏ ఒక్కరు కూడా ఆపే సాహసం మాత్రం చేయడం లేదు. అయితే, యువతులు మాత్రం మాస్క్‌లు ధరించి మరీ ఒకరిపై మరొకరు పంచ్‌లు విసురుకుంటూ తన్నుకుంటున్నారు. అంతటితో ఆగకుండా, జుట్టులు కూడా పీక్కుంటున్నారు. ఏ ఒక్కరు కూడా వెనక్కి తగ్గడం లేదు.

అయితే, ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. సతు.సైనీ అనే ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్‌ సామాజిక మాధ్యమంలో పోస్ట్‌ చేశాడు. దీంతో ఇది వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ‘వామ్మో.. వీరు లేడి రెజ్లర్స్‌లా ఉన్నారు., ‘వీరిని.. బాక్సింగ్‌ పోటీలకు పంపించాలి..’, ‘ఇంతకి కారణం ఏంటో చెప్పలేదు..’, ‘వీరిని.. ఏవడు కట్టుకుంటాడో కానీ.. అయిపోతాడు.’ ‘ ద్యావుడా.. కంగారుల మాదిరి తన్నుకుంటున్నారు..’ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement