Tiger Died After Fight With Hedgehog Became Viral, ముళ్లపందితో పోరులో పులి మృతి  - Sakshi
Sakshi News home page

ముళ్లపందితో పోరులో పులి మృతి 

Published Wed, Sep 15 2021 9:14 AM | Last Updated on Wed, Sep 15 2021 12:32 PM

Tiger Lost Life After Fight With Hedgehog Became Viral - Sakshi

మైసూరు: ముళ్లపంది, పులి మధ్య సాగిన పోరు లో చివరకు పులి ప్రాణాలు కోల్పోయిన ఘటన కర్ణాటకలోని మైసూరు జిల్లా బండీపుర పులుల సంరక్షణ ప్రాంతంలో జరిగింది. మంగళవారం అటవీశాఖ సిబ్బందికి 6 సంవత్సరాల వయసున్న మగ పులి కళేబరం కనిపించింది. ఘటనా స్థలానికి  పశువైద్యులు వచ్చి పరిశీలించారు. శరీర భాగాల్లోకి ముళ్లు చొచ్చుకుపోయి ఉండటాన్ని గమనించారు. ముళ్లపంది–పులి మధ్య జరిగిన పోరాటంలో పులి తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం పులి కళేబరాన్ని అక్కడే ఖననం చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement