second class
-
Rahul Gandhi: మహిళలంటే చిన్నచూపు!
న్యూఢిల్లీ: మహిళలను బీజేపీ రెండో శ్రేణి పౌరులుగానే చూస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. నార్త్ వెస్ట్ ఢిల్లీ పార్టీ అభ్యర్థి ఉదిత్ రాజ్ తరఫున గురువారం ఢిల్లీలోని మంగోల్‌పురిలో మహిళలు మాత్రమే పాల్గొన్న ఎన్నికల ప్రచార కార్యక్రమంలో రాహుల్ ప్రసంగించారు. ‘‘ఎంతో ఆర్భాటంగా ఇప్పుడే మహిళాలోకం కలలు సాకారం చేస్తున్నట్లు పార్లమెంట్లో నారీశక్తి వందన్ అధినయమ్(మహిళా రిజర్వేషన్ బిల్లు) ప్రవేశపెట్టారు. ఆ చట్టం ఇప్పుడు కాదు ఏకంగా పదేళ్ల తర్వాత అమలుచేస్తామని తీరిగ్గా చెప్పారు. ఈ నిర్ణయం వెనుక ఒక సిద్దాంతముంది. అదే ఆర్ఎస్ఎస్. బీజేపీ సైద్ధాంతిక మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ అయితే ఏకంగా మహిళలను కనీసం ‘శాఖ’లోకి అడుగుపెట్టనివ్వడంలేదు. మహిళలను రెండో తరగతి పౌరులుగా భావించాలని ఆర్ఎస్ఎస్ నరనరాల్లో నాటుకుపోయింది’ అని విమర్శలు గుప్పించారు. వర్కింగ్ ఉమెన్ పనికి గుర్తింపు దక్కట్లేదు ‘‘భారత్‌లో ప్రతీ రంగం గురించి మాట్లాడతాంగానీ వర్కింగ్ ఉమెన్ ఇంట్లోనూ చేసే శ్రమకు ఎక్కడా గుర్తింపు దక్కట్లేదు. రోజంగా ఆఫీస్/కార్యస్థలంలో పనిచేసి అలసిపోయిన మహిళలు ఇంటికొచ్చాక మళ్లీ రెండో షిప్ట్ మొదలెడతారు. పిల్లల ఆలనాపాలనా చూసుకుని ఇంటి పనులన్నీ చేస్తారు. ఈ పనికి వాళ్లకు ఎలాంటి చెల్లింపులు ఉండవు. పురుషులు రోజుకు 8 గంటలు పనిచేస్తే మహిళలు 16 గంటలపైనే పనిచేస్తారు. వారి శ్రమకు ప్రతిఫలంగా ఏమీ దక్కట్లేదు. ఇది ఒక రకంగా చెల్లింపులులేని గుర్తింపులేని పని. మేం అధికారంలోకి వస్తే మహాలక్ష్మీ యోజన ద్వారా పేద మహిళలకు నెలకు రూ.8,500 చొప్పున ఏటా రూ.1 లక్ష వారి ఖాతాలో జమచేస్తాం’’ అని రాహుల్ అన్నారు. మే 25నాటి పోలింగ్‌కు ప్రచారం గురువారంతో ముగుస్తుండటంతో ఢిల్లీ మెట్రోలోనూ రాహుల్ ప్రయాణించారు. ‘‘నార్త్ ఈస్ట్ ఢిల్లీ కాంగ్రెస్ అభ్యర్థి కన్హయ్య కుమార్ తరఫున సైతం రాహుల్ దిల్షాద్ గార్డెన్ ప్రాంతంలో ప్రచారంలో పాల్గొన్నారు. ఏపీ భవన్లో మధ్యాహ్న భోజనం ఎన్నికల ప్రచారంలో అలసిపోయిన రాహుల్ మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్/తెలంగాణ భవన్‌కు వచ్చారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌సహా దాదాపు 10 మందితో కలిసి రాహుల్ భోజనం చేశారు. రాహుల్ పూరీలు, చపాతీలు, కోడికూర వేపుడు, రొయ్యల వేపుడు ఆర్డర్ ఇచ్చారు. తొలుత పూరీ/చపాతీని పప్పుతో కలిపి తిన్నారు. తర్వాత చికెన్ ఫ్రై, రొయ్యల ఫ్రైతో చపాతీ/పూరీ తిన్నారు.మీ కీలక పాత్ర పోషించండి...సోనియా గాంధీ ఢిల్లీ పరిధిలో ప్రచారం చివరిరోజు సందర్భంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ గురువారం ఓటర్లకు ఒక వీడియో సందేశం విడుదలచేశారు. ‘‘ ప్రజాస్వామ్య పరిరక్షణకు జరుగుతున్న కీలక ఎన్నికలివి. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రాజ్యాంగబద్ధ సంస్థలపై దాడులు కొనసాగుతున్న వేళ వచి్చన ఎన్నికలివి. ఈ పోరాటంలో మీరు మీ కీలక పాత్ర పోషించండి. మీ ఓటు ఉపాధి కల్పనకు బాటలువేస్తుంది. ఎగసిన ధరలను కిందకు దింపుతుంది. మహిళలకు సాధికారతను కట్టబెడుతుంది. మెరుగైన భవిష్యత్తుతో సమానత్వాన్ని సాధిస్తుంది. ఢిల్లీ పరిధిలోని ఏడు ఎంపీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, ‘ఇండియా’ కూటమి అభ్యర్థులను గెలిపించండి’ అని సోనియా సందేశమిచ్చారు. -
షాకింగ్.. క్లాస్‌లో తోటి విద్యార్థులతో గొడవ.. రెండో తరగతి బాలుడు మృతి..
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ఫిరోజాబాద్ జిల్లా కిషన్‌పుర్ గ్రామంలో షాకింగ్ ఘటన జరిగింది. ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థి తోటి విద్యార్థులతో గొడవపడి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు. చనిపోయిన బాలుడి పేరు శివం(7). తరగతి గదిలో తోటి విద్యార్థులతో గొడవపడ్డాడు. దీంతో వారంతా ఒక్కసారిగా అతని ఛాతిపై దూకారు. ఫలితంగా అతనికి ఊపిరాడక స్పృహ కోల్పోయాడు. పాఠశాల సిబ్బంది హుటాహుటిన బాలుడ్ని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. జిల్లా అధికారులు పాఠశాల చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చాక ప్రిన్సిపల్‌తో పాటు ఇతర సిబ్బందిని ప్రశ్నించి చర్యలు తీసుకుంటామన్నారు. చదవండి: సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు దోచుకెళ్లిన గ్యాంగ్.. -
Indian Railways: ప్యాసింజర్ రైళ్లలో ఛార్జీల మోత
Indian Railways continue To reservations For passenger trains second class Journey: సెకండ్ క్లాస్ ప్రయాణాలను రిజర్వేషన్ కేటగిరీలో కొనసాగించడంపై రైల్వే శాఖ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడింది. సామాన్యుడికి రిజర్వేషన్ ఛార్జీల భారం తప్పదని పరోక్షంగా తేల్చేసింది రైల్వే మంత్రిత్వ శాఖ. ఈ మేరకు ప్యాసింజర్ రైళ్లలో ద్వితియ శ్రేణి తరగతిలో ప్రయాణాలకు ‘రిజర్వేషన్’ కొనసాగుతుందని పార్లమెంట్లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎదురైన ఓ ప్రశ్నకు రైల్వే మంత్రి సమాధానమిచ్చారు. కరోనా ఫస్ట్ ఫేజ్ తర్వా తి సడలింపులతో భారతీయ రైల్వే శాఖ ‘కొవిడ్ స్పెషల్’ పేరిట ప్రత్యేక రైళ్లు నడిపింది. ఆ టైంలో ప్యాసింజర్ రైళ్లను మెయిల్ ఎక్స్‌ప్రెస్‌లుగా, పండుగ స్పెషల్‌గా మార్చేసి ఎక్కువ ఛార్జీలతో రైళ్లను నడిపించింది భారతీయ రైల్వేస్. పైగా సెకండ్ క్లాస్ సహా అన్ని కేటగిరీలను రిజర్వేషన్ కోటాలోకి మార్చేసింది. అయితే.. తాజాగా కొవిడ్ స్పెషల్ కేటగిరీని ఎత్తేస్తూ.. రెగ్యులర్ సర్వీసులుగా వాటిని మార్చేస్తున్నట్లు ప్రకటించింది రైల్వే శాఖ. దీంతో టికెట్ రేట్లు తగ్గుతాయని, సామాన్యుడికి ఊరట లభించిందని, ప్యాసింజర్ రైళ్లు ప్రయాణికుల కోలాహలంతో పూర్వవైభవం సంతరించుకోవచ్చని భావించారంతా. కానీ,. అనూహ్యంగా ప్యాసింజర్ రైళ్లలో సెకండ్‌క్లాస్ ప్రయాణాలకు ఇంకా రిజర్వేషన్ కేటగిరీ కిందే కొనసాగుతోంది. ఈ విషయమై ఎదురైన ప్రశ్నకు రైల్వే మంత్రి పార్లమెంట్లో బదులిచ్చారు. ప్యాసింజర్ రైళ్లలో సెకండ్ క్లాస్ ప్రయాణాలకు, ప్రయాణికులు రిజర్వేషన్ బుకింగ్ చేసుకోవాల్సిందేనని మంత్రి పేర్కొన్నారు. ఒకవేళ అత్యవసర లేదంటే ప్రత్యేక పరిస్థితులు ఏర్పడితే మాత్రం.. కొన్ని రైళ్లకు మినహాయింపు ఇవ్వొచ్చని పేర్కొన్నారు. దీంతో రిజర్వేషన్ ఛార్జీల రూపంలో సామాన్యుడికి మోత మోగనుంది. అంతేకాదు తక్కువ దూరం ప్రయాణాలైనా సరే.. రిజర్వేషన్ కింద భారం మోయాల్సి వస్తుంది. ఇదిలా ఉంటే రవాణాశాఖ నివేదికల ప్రకారం.. 364 ప్యాసింజర్ రైళ్లను 2020-2021 ఏడాది మధ్య ఎక్స్‌ప్రెస్ సర్వీసులుగా మార్చేసి నడిపించింది రైల్వే శాఖ. సెకండ్ క్లాస్ కేటగిరీలో సగటున రెండున్నర కోట్ల మంది ప్రయాణిస్తున్నట్లు ఒక అంచనా. సింగిల్ క్లిక్‌తో 35పై.లకే 10 లక్షల ఇన్సూరెన్స్ -
చిన్నారిపై ప్రైవేటు ఉపాధ్యాయుడి లైంగిక వేధింపులు
పోలీస్‌స్టేషన్‌లో తల్లిదండ్రుల ఫిర్యాదు కీచకుడిపై నిర్భయ కేసు నమోదు వైరా : ఆరేళ్ల బాలికపై ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు కొంత కాలంగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్న సంఘటన ఖమ్మం జిల్లా వైరాలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, బాలిక తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మండల కేంద్రంలోని పాఠశాలలో కొణిజర్ల మండలం కొత్తకాసారం గ్రామానికి చెందిన తేళ్లూరి విజయ్‌కుమార్ రెండేళ్ల నుంచి ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఈనెల 20న అదే పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. వరుసగా రెండు రోజులపాటు తరగతి గదిలోనే చివరి బెంచీలో కూర్చోమని చెప్పి వేధించ సాగాడు. కాగా.. చిన్నారి నాన్నమ్మకు విషయాన్ని చెప్పి.. ఆ పాఠశాలకు వెళ్లనని.. తనను మరో పాఠశాలలో చేర్పించమంటూ ఆందోళన చెందుతూ చెప్పింది. ఆ సమయంలో తండ్రి ఇంట్లో లేకపోవడం.. విషయం తెలుసుకున్న బాలిక తల్లి ఆందోళనకు గురైంది. మంగళవారం పాఠశాలకు వెళ్లి విషయాన్ని యాజమాన్యానికి చెప్పడంతో.. వారు సదరు ఉపాధ్యాయుడిని మందలించి.. పాఠశాల నుంచి వెళ్లగొట్టారు. దీనిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో.. సీఐ చేరాలు.. ఏఎస్సై ఖాజాను పాఠశాలకు పంపించి వివరాలు సేకరించారు. విజయ్‌కుమార్‌పై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై కరస్పాండెంట్‌ను వివరణ కోరగా.. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని, ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కాగా, కీచక ఉపాధ్యాయుడు పరారీలో ఉన్నాడు. -
రెండో తరగతి విద్యార్థినిపై అత్యాచారం
బెంగళూరు: ఆరేళ్ల బాలికపై స్కూల్లో అత్యాచార ఘటనను మరువక ముందే బెంగళూరులో మరో చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. రెండో తరగతి చదువుతున్న బాలిక(7)పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సుంకదకట్ట మొయిన్‌రోడ్డులోని శాంతిధామ స్కూల్లో ఓ బాలిక రెండో తరగతి చదువుతోంది. బాలిక ఇంటిలో ఓ మహిళ పనిచేస్తూ వారి ఇంటిలోనే ఉంటోంది. ఈ నెల 27న బాలికను ఇంటిలో వదిలి తల్లి బయటకు వెళ్లింది. తర్వాత పని మనిషి కూడా బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఇంటికి చేరుకున్న పనిమనిషి కుమారుడు శ్రీనివాస్ (28) బాలికపై అత్యాచారం చేశాడు. పోలీసులు నిందితుడితో పాటు అతడి తల్లిని అరెస్ట్ చేశారు.