రెండో తరగతి విద్యార్థినిపై అత్యాచారం | The second class student rape | Sakshi
Sakshi News home page

రెండో తరగతి విద్యార్థినిపై అత్యాచారం

Published Thu, Jul 31 2014 2:37 AM | Last Updated on Tue, Nov 6 2018 4:56 PM

రెండో తరగతి విద్యార్థినిపై అత్యాచారం - Sakshi

రెండో తరగతి విద్యార్థినిపై అత్యాచారం

బెంగళూరు: ఆరేళ్ల బాలికపై స్కూల్‌లో అత్యాచార ఘటనను మరువక ముందే బెంగళూరులో మరో చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. రెండో తరగతి చదువుతున్న బాలిక(7)పై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.  సుంకదకట్ట మొయిన్‌రోడ్డులోని శాంతిధామ స్కూల్లో ఓ బాలిక రెండో తరగతి చదువుతోంది.

బాలిక ఇంటిలో ఓ మహిళ పనిచేస్తూ వారి ఇంటిలోనే ఉంటోంది. ఈ నెల 27న  బాలికను ఇంటిలో వదిలి తల్లి బయటకు వెళ్లింది. తర్వాత పని మనిషి కూడా బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఇంటికి చేరుకున్న పనిమనిషి కుమారుడు శ్రీనివాస్ (28) బాలికపై అత్యాచారం చేశాడు. పోలీసులు నిందితుడితో పాటు అతడి తల్లిని అరెస్ట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement