స్కూల్లో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం కామన్. ఒక్కొక్క సబ్జెక్ట్ ఆధారంగా ఎగ్జామ్స్ పెడుతుంటారు. జనరల్ నాలెడ్జ్, సామాజిక అంశాలపై వ్యాస రచన పోటీలు కూడా ఉంటాయి. అయితే కొన్నిసార్లు పరీక్షల్లో పిల్లలు రాసే సమాధానాలు విచిత్రంగా ఉంటాయి. ప్రశ్నతో సంబంధం లేకుండా ఏదో ఏదో రాస్తుంటారు. అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా ఓ విద్యార్థి 10 మార్కుల ప్రశ్నలో పెళ్లి అంటే ఏంటో వివరించమని అడిగారు. పెళ్లిపై బాలుడి చెప్పిన సమాధానం నెటిజన్లను నవ్విస్తోంది.
సోషల్ స్టడీస్ పరీక్ష పత్రంలో పెళ్లి అంటే ఏంటని అడిగారు. విద్యార్థి రాసిన ఆన్సర్ షీట్‌ను సోషల్ మీడియాలోషేర్ చేశారు. అందులో ‘యువతికి ఆమె తల్లిదండ్రులు నువ్వు ఇప్పుడు పెద్ద అమ్మాయివి అయ్యావు అని చెప్పినప్పుడు పెళ్లి జరుగుతుంది. మేము నీకు ఇక తిండి పెట్టి పోషించలేమని, వెళ్లి నీకు తిండి పెట్టే వ్యక్తిని వెతుక్కోవడం మంచిదని ఆమెకు తల్లిదండ్రులు చెప్తారు.
మరోవైపు నువ్వు పెద్దవాడివి అయ్యావు, పెళ్లి చేసుకో అంటూ అబ్బాయికి కూడా వాళ్ల తల్లిదండ్రులు చెబుతుంటారు. అప్పుడు పెళ్లి చేసుకోవాల్సిన అబ్బాయిని యువతి కలుసుకుంటుంది. వాళ్లిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకొని చివరికి ఇద్దరు కలిసి జీవించడానికి అంగీకరిస్తారు. ఇక పిల్లలను కనడానికి తప్పుడు పనులు చేయడం ప్రారంభిస్తారు’ అని విద్యార్థి రాసుకొచ్చాడు.
What is marriage? 😂 pic.twitter.com/tM8XDNd12P
— Velu (@srpdaa) October 11, 2022
అయితే బాలుడి సమాధానం చూసిన టీచర్ అతడు రాసిన మొత్తం జవాబును కొట్టివేసింది. పది మార్కులకు గాను సున్నా వేసింది. అంతేగాక నాన్‌సెన్స్ అంటూ రిమార్క్ రాసి పెట్టింది. కాగా పిల్లవాడు తెలిసి తెలియక రాసిన సమాధానం నెటిజన్లను ఆకర్షిస్తుంది. చాలా ఫన్నీగా ఉందంటూ బాలుడి నిజాయితీని మెచ్చుకుంటూ కామెంట్ చేస్తున్నారు.
చదవండి: Army Dog Zoom: ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడిన ‘జూమ్’ మృతి
Comments
Please login to add a commentAdd a comment