జైపూర్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా రాజస్తాన్‌లోని కోటి మంది పాఠశాల విద్యార్థులు దేశభక్తి గీతాలను ఆలపించి ప్రపంచ రికార్డు సృష్టించారు. వందేమాతరం, సారే జహాసె అచ్చా తదితరాలను విద్యార్థులు 25 నిమిషాలపాటు ఆలపించారు. శుక్రవారం సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన దేశభక్తి గీతాలాపన ప్రధాన కార్యక్రమంలో రాజస్తాన్ సీఎం అశోక్ గహ్లోత్ మాట్లాడారు.
రికార్డు సాధనలో పాలుపంచుకున్న విద్యార్థులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ‘కోటి మంది విద్యార్థులు ఆలపించిన దేశభక్తి గీతాలను విని లండన్ నుంచి ప్రఖ్యాత వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తింపు సర్టిఫికెట్ పంపడం ఎంతో సంతోషంగా ఉంది’ అని ఆయన అన్నారు. జిల్లా కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఇన్‌ఛార్జి మంత్రులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment