
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు తూట్లు పొడిచింది కాంగ్రెస్ పార్టీనే అని, ఈ విషయంలో బహిరంగ చర్చకు ఉత్తమ్ కుమార్‌రెడ్డి సిద్ధమా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలకు బీజేపీ చేరువ అవుతుంటే సహించలేక దివాళా కోరు రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. నిన్నటి వరకు సీఏఏపై కుట్రలు కుతంత్రాలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు మరో అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు. మజ్లిస్‌ను తలపై పెట్టుకొని కాంగ్రెస్ పార్టీనే పాముకు పాలు పోసి పెంచినట్టు పెంచిందన్నారు. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లపై ఉత్తమ్ ధర్నా చేస్తారట.. దాని పూర్వా పరాలు ఆయనకు తెలుసా? అని ప్ర శ్నించారు. ప్రజలను తప్పు దోవ పట్టించేందుకు కాంగ్రెస్ మరో కుట్ర చేస్తోందనీ, దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. ఎంఐఎం నేతలు అక్బరుద్దీన్, అసదుద్దీన్‌ల మొసలి కన్నీరు, కపట ప్రేమను ఎవరు విశ్వసించరన్నారు.
Comments
Please login to add a commentAdd a comment