సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్‌లో మాజీ సీఎం కేసీఆర్ పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేశారు. ఇది సామాన్య నేరం కాదు.. దేశద్రోహం లాంటిది అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ కేసులో సూత్రధారిపై చర్యలు తీసుకోవాలి అంటూ వ్యాఖ్యలు చేశారు.
కాగా, ఎంపీ లక్ష్మణ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరంలో అవినీతిని వెలికితీస్తామన్న సీఎం రేవంత్ ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. వారిపై చర్యలు తీసుకోవడంలో సీఎం రేవంత్ వెనకడుగు వేస్తున్నారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడితోనే రేవంత్ ఈ కేసులో రాజీ పడ్డారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్‌లో బాధితుడు అయినప్పటికీ రేవంత్ ఏం చేయలేని స్థితిలో ఉన్నారు.
కాంగ్రెస్-బీఆర్‌ఎస్ ఒక్కటేనని ఈ వ్యవహారంతో తేలిపోయింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ ఇండియా కూటమిలో చేరుతోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారనే ఆరోపణలతో ఢిల్లీ నేతను అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను కాపాడేందుకు ఈ కేసును వాడుకున్నారు. ఇక, తెలంగాణలో అందెశ్రీ పాటను అధికార గీతం చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము. తెలంగాణలో బీజేపీ డబుల్ డిజిట్ రావడం ఖాయం. ఆగస్టు సంక్షోభం వస్తే మేము రక్షించే ప్రసక్తే లేదు అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment