సాక్షి, హైదరాబాద్ : నల్లధనంతో ఎన్నికలను శాసించే సంస్కృతికి టీఆర్ఎస్ తెరలేపిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం నగరంలో ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవటంతోనే కేసీఆర్, కేటీఆర్‌లు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్నారని దుయ్యబట్టారు. దొడ్డిదారిన మేయర్,మున్సిపల్ చైర్మన్ పదవులను దక్కించుకోవాలనే కుట్రతో ప్రభుత్వం ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లటం లేదని వ్యాఖ్యానించారు. మద్యం,మైనింగ్,ఇసుక మాఫియాలను ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే అభ్యర్ధులు అమ్ముడు పోతారని, టీఆర్ఎస్ కు ఓటేస్తే మజ్లీస్ కు తాకట్టు పెడతారని మండిపడ్డారు. ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపీని గెలిపిస్తే కేంద్రం నిధులతో పట్టణాలను సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment