సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల వార్ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. రెండు పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. దీంతో, మునుగోడు ఉప ఎన్నికల వేళ తెలంగాణ పాలిటిక్స్ హీటెక్కాయి.
తాజాగా బీజేపీ ఎంపీ లక్ష్మణ్.. మంత్రి కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, ఎంపీ లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ నువ్వు మోహన్ భగవత్ కాలిగోటికి కూడా సరిపోవు. భగవత్ సాహసాలకు కేసీఆర్, ఆయన కుటుంబం ఏమాత్రం సరితూగరు. ఆర్ఎస్ఎస్ ముందు మీరెంత.. మీ స్థాయి ఎంత అంటూ
ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అయితే, అంతకు ముందు మంత్రి కేటీఆర్.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు. మోహన్ భగవత్ ఎవరూ అంటూ ప్రశ్నించిన కేటీఆర్.. ఆయన ఎప్పుడైనా కౌన్సిలర్ గానైనా గెలిచారా అంటూ వ్యాఖ్యలు చేశారు. మోహన్ భగవత్ చిల్లర మాటలు మాట్లాడుతున్నారని.. ముస్లింలను వేరు చేసే కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment