వర్షిణి ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిపింది.. | Twists in Rowdy Sheeter Murder Case Karnataka | Sakshi
Sakshi News home page

లక్ష్మణ్‌ హత్యకేసు రోజుకో మలుపు

Published Fri, Mar 15 2019 1:24 PM | Last Updated on Fri, Mar 15 2019 1:24 PM

Twists in Rowdy Sheeter Murder Case Karnataka - Sakshi

లక్ష్మణ్‌కు కేక్‌ తినిపిస్తున్న వర్షిణి (ఫైల్‌)

ఇద్దరి బర్త్‌డేలలో కేక్‌ను తినిపించింది. ఇద్దరు ఆమె మాయలో పడ్డారు..

యశవంతపుర : రౌడీ లక్ష్మణ్‌ హత్యకేసు రోజుకో మలుపు తిరుగుతోంది.  హత్య కేసులో ప్రధాన నిందితురాలు వర్షిణిగా గుర్తించారు. హత్యలో ఆమె పాత్ర ఎక్కువగా ఉన్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. హత్య గురైన లక్ష్మణ్‌పై అభిమానం, మరోవైపు రూపేశ్‌తో ప్రేమ నడిపింది. ఇద్దరి బర్త్‌డేలలో కేక్‌ను తినిపించింది. ఇద్దరు ఆమె మాయలో పడ్డారు.  ఈ డబుల్‌ గేమ్‌ కారణంగా లక్ష్మణ్‌ను హత్య చేయించిన రూపేశ్‌ పథకం వేసి దొరికిపోయాడు. వర్షిణి, లక్ష్మణ్‌ల మధ్య నడుస్తున్న ప్రేమ పురాణం రూపేశ్‌కు తెలియదు. లక్ష్మణ్, రూపేశ్‌లతో ప్రేమ రాయభారం నడిపింది. వర్షిణి అసలు విషయం తెలియక రూపేశ్‌ లక్ష్మణ్‌ను హత్య చేయించినట్లు సీసీబీ విచారణలో తెలిసింది. తన విలాసాలకు మాత్రమే లక్ష్మణ్‌ నుండి డబ్బులు తీసుకోని ఎంజాయ్‌ చేసింది.

వర్షిణి అకౌంట్‌లో లక్ష్మణ్‌ లక్షల్లో డబ్బులు వేసిన వివరాలను కూడా సీసీబీ పోలీసులు గుర్తించారు. హత్యకు గురైన రోజు వర్షిణి బెంగళూరులో ఉన్నట్లు చెప్పింది. దీంతో లక్ష్మణ్‌ ఆర్‌జీ రాయల్‌ హోటల్‌లో ఒక గదిని ఆమె కోసం బుక్‌ చేశాడు. అయితే అతను వెళ్లినా వర్షిణి ఎంతసేపటికి హోటల్‌కు రాలేదు. దీంతో లక్ష్మణ్‌ వాట్సాప్‌ కాల్‌ చేసి మాట్లాడారు. తను ఇస్కాన్‌ ఎదురు ఉన్న టోయోటా షోరూం వద్ద ఉన్నట్లు షోరూం ఫొటోను తీసి పంపింది. నీవే వచ్చి తీసుకెళ్లాలని సూచించింది. ఫోటో ఆధారంగా లక్ష్మణ్‌ ఆమెను తీసుకురావటానికి కారులో బయలుదేరాడు. మార్గం మధ్యలోనే కాపుకాచిన రౌడీల ముఠా హత్య చేసి చేశారు. హత్య జరిగిన మరుసటి రోజు వర్షిణి లండన్‌ నుండి బెంగళూరుకు వచ్చినట్లు సీసీబీ పోలీసులు తెలిపారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement