![Bjp Mp Laxman Comments On Brs And Congress - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/17/laxman.jpg.webp?itok=QvUNSY4z)
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా మోదీ గాలి వీస్తోందని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ అన్నారు. బుధవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, 12 రాష్ట్రాల్లో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవలేదన్నారు. సర్వేలు సైతం బీజేపీ గెలుపును ధృవీకరిస్తున్నాయని చెప్పారు. 247 స్థానాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ 235 స్థానాల్లో ఓడిపోబోతుందంటూ జోస్యం చెప్పారు.
‘‘కాంగ్రెస్ పార్టీ నేలా విడిచి సాము చేస్తోంది. రాహుల్ గాంధీ ప్రధాని అయినట్లు కాంగ్రెస్ నేతలు పగటి కలలు కంటున్నారు. రెండు అంకెల సీట్లు బీజేపీకి రావడం ఖాయం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ డూప్ ఫైట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి పస లేని విమర్శలు చేస్తున్నారు. అభద్రతా భావంతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ గత చరిత్రగానే మారిపోతోంది. ఆడలేక మద్దెల చెరువు అన్నట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒకటే అసెంబ్లీ సీటు బీజేపీ సాధించగా... 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ స్థానాలు గెలిచింది. తెలంగాణలో నాలుగు సీట్లు గెలవడంతోనే బీజేపీ సీట్ల సంఖ్య 300 మార్క్ దాటింది’’ అని లక్ష్మణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment