సీఎంను కలుస్తామంటే అరెస్టులా..? | BJP Leader Laxman Fires On Telangana Government Over Corona Virus | Sakshi
Sakshi News home page

'తెలంగాణలో ప్రత్యేక రాజ్యాంగం ఉందా'

Published Fri, Jun 12 2020 12:53 PM | Last Updated on Fri, Jun 12 2020 12:58 PM

BJP Leader Laxman Fires On Telangana Government Over Corona Virus - Sakshi

సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించిన బీజేపీ ప్రతినిధి బృందాన్ని శుక్రవారం పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని కలిసి పరిస్థితులను వివరించడానికి  బీజేపీ నేతలు అపాయింట్‌మెంట్‌ కోరారు. అయితే  సీఎంను కలవడానికి అపాయింట్‌మెంట్‌ దొరక్కపోవడంతో బీజేపీ నేతృత్వంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్‌లతో కూడిన బృందం నేరుగా ప్రగతి భవన్‌ వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రగతి భవన్‌ వద్ద భారీగా పోలీసులను మోహరించి బీజేపీ నాయకుల్ని హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ముందస్తుగా ప్రగతి భవన్‌కు వెళ్లే అన్ని దారుల్లోనూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

హౌస్‌ అరెస్ట్‌ల‌పై బీజేపీ నేత లక్ష్మణ్‌ మీడియాతో మాట్లాడుతూ.. సీఎంను కలుస్తామంటే అనుమతివ్వకుండా హౌస్‌ అరెస్ట్‌ చేయడం దారుణం. రాష్ట్రంలో పాలన ఉందా..? అంటూ ప్రశ్నించారు. కరోనా పరీక్షలు దేశంలోనే అత్యల్పంగా తెలంగాణలో జరగడం దారుణం. గాంధీలో కరోనా రోగులకు కనీస వసతులు కూడా లేవు. గాంధీ వెళ్లే కంటే స్మశానానికి వెళ్లడం మంచిదనే భావన కలుగుతోంది. చనిపోయిన శవాలను కూడా సరిగా ఇవ్వడం లేదంటే అక్కడ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎదురుదాడికి దిగడం పరిపాటిగా మారింది. తెలంగాణలో ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా ఉందా..? ఆర్టికల్ 370 లాంటిది తెలంగాణలో అమలు జరుగుతోందా..? అంటూ మండిపడ్డారు. చదవండి: వారిని స్వదేశానికి తీసుకురండి 

డెత్‌ రేట్‌ దేశ సగటుకంటే తెలంగాణలో అధికంగా ఉంది. గచ్చిబౌలి‌ టిమ్స్ ఏమైంది. ప్రస్తుతం అందులో పిల్లలు క్రికెట​ ఆడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్ చార్జీలను పెంచి పేదల నడ్డి విరుస్తున్నారు. విద్యుత్ చార్జీలను రద్దు చేసి ప్రజలకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలపై కేంద్ర హోం శాఖ మంత్రికి లేఖ రాశాము. ప్రత్యేక బృందాన్ని తెలంగాణకు పంపించాలని లేఖలో కోరాము. కేంద్ర ప్రభుత్వ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందంటూ' బీజేపీ నేత లక్ష్మణ్‌ విమర్శలు గుప్పించారు. చదవండి: గాంధీలో మళ్లీ అదే సీన్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement