
శ్రీనివాస సాయి, ప్రియాంక జైన్ హీరోహీరోయిన్లుగా సతీష్ చంద్ర నాదెళ్ల దర్శకత్వంలో లక్ష్మణ్ క్వాదారి నిర్మించిన చిత్రం ‘వినరా సోదరా వీరకుమారా’. ఈ చిత్రంలోని తొలిపాటను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రం ట్రైలర్ చూశాను. చాలా ఆసక్తికరంగా ఉంది. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ చిత్రం హిట్ సాధించాలి. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు. ‘‘ఈ చిత్రనిర్మాత లక్ష్మణ్‌తో కలిసి ‘మేం వయసుకి వచ్చాం’ అనే సినిమా చేశాం.
ఇప్పుడు తను నిర్మించిన ఈ సినిమా చూశాం. బాగుంది. చిత్రబృందం కొత్త ప్రయత్నం చేశారు. దర్శకుడు అనిల్‌తో సాంగ్ లాంచ్ కావడం శుభపరిణామం’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ‘‘మా సినిమా మొదటి పాటను దర్శకుడు అనిల్ రావిపూడి విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఆయనకు కృతజ్ఞతలు’’ అన్నారు లక్ష్మణ్. ఈ చిత్రానికి శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు.