![Lets take action at polling booth level](/styles/webp/s3/article_images/2024/05/8/laxman_0.jpg.webp?itok=vUITD0TM)
ఓటర్లను వారి ఇళ్లల్లో కలిసి మాట్లాడదాం... పోలింగ్‌బూత్ స్థాయిలో కార్యాచరణ చేపడదాం
ఈ నాలుగు రోజుల్లో ఒక్క నిమిషం కూడా వృథా కావొద్దు
ప్రచార ఉధృతిపై బీజేపీ నేతల సమీక్ష
ఎన్నికల మేనేజ్‌మెంట్, మీడియా కమిటీ భేటీలకు హాజరైన పార్టీ జాతీయ నేత బీఎల్ సంతోశ్, రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, డా.కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చివరి నాలుగు రోజుల్లో నిర్వహించే ఎన్నికల ప్రచారం, దీంతో ముడిపడిన అంశాలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రచార గడువు ముగియనుండటంతో.. అప్పట్లోగా చేపట్టే ప్రచారం, ఇప్పటివరకు నిర్వహించిన ప్రచార సరళి, ప్రధాన ప్రత్యర్థులైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను ఎలా ఎదుర్కోవాలి, ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతూ ప్రస్తావించాల్సిన అంశాలు, సామాజిక మాధ్యమాల్లో పనిగట్టుకుని దు్రష్పచారం జరిగితే ఎలా ఖండించాలి అన్న వాటిపై కీలక నేతలు సమీక్షించారు.
శనివారం లోగా పోలింగ్‌బూత్ స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు ఇంటింటి ప్రచారానికి ప్రాధాన్యతనిచ్చి ఓటర్లను వారి ఇళ్లల్లో కలుసుకునేలా కార్యక్రమాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ నాలుగు రోజుల్లో ఒక్క నిమిషం కూడా వృథా కాకుండా విస్తృత ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. మంగళవారం బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల మేనేజ్‌మెంట్ కమిటీ, మీడియా కమిటీలతో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోశ్, ఎలక్షన్ కమిటీ చైర్మన్ డా.కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి, రాష్ట్ర ప్రధానకార్యదర్శి (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ పాల్గొన్నారు.
మీడియా, సోషల్ మీడియా కమిటీల భేటీలో... వీరితో పాటు రాజస్తాన్ సీఎం భజన్‌లాల్ శర్మ, తమిళనాడు పార్టీ అధ్యక్షుడు అన్నామలై, పార్టీ నేతలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, ప్రేంసింగ్ రాథోడ్, డా.ఎస్.ప్రకాష్ రెడ్డి, పోరెడ్డి కిశోర్ రెడ్డి, రచనా రెడ్డి, పార్టీ సోషల్ మీడియా ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.
అలాంటి దు్రష్పచారం మళ్లీ జరగొద్దు..
ఐదు నెలల పాలనలో కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల హామీల అమలు నెరవేర్చకపోవడం వంటి వాటిని ఎండగట్టడంతో పాటు... రిజర్వేషన్ల రద్దు, ఇతర అంశాలపై కొన్నిరోజులుగా బీజేపీపై చేస్తున్న దు్రష్పచారాన్ని మరింత సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ నాయకులకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ సూచించారు.
తెలంగాణలోని కొన్ని మీడియా సంస్థలు (సాక్షి కాదు) బీజేపీ పట్ల ద్వంద్వ విధానాలు అవలంబిస్తున్నాయని, పారీ్టకి నష్టం కలిగించే దిశలో ఇతర పారీ్టల ప్రచారానికి ఊతమిస్తున్నాయని సంతోష్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. ఒక పత్రికలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి దుష్యంత్ కుమార్ చౌహాన్ రిజర్వేషన్లపై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా వక్రీకరించి, తప్పుడు ప్రచారానికి దోహదపడేలా వార్త ప్రచురించారని ఆయన ప్రస్తావించినట్టు తెలిసింది. చివరి నాలుగు రోజులూ ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించినట్లు పారీ్టవర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment