
రైజింగ్ హాండ్స్ ప్రొడక్షన్స్ నిర్మాణంలో తీస్తున్న సినిమా 'సీతారాం సిత్రాలు'. లక్ష్మణ్, భ్రమరాంబిక, కిశోరి దాత్రక్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంతో డి.నాగ శశిధర్‌రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీ పూజా కార్యక్రమాలు నిర్మాత రాజ్ కందుకూరి, దర్శకుడు అశోక్ చేతుల మీదుగా జరిగాయి. టైటిల్ లోగోను ప్రముఖ సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ కె.వి.గుహన్ విడుదల చేశారు.
"నువ్వు గెలవనంత వరకు ఏమీ చెప్పిన అది చెత్తే.. ఒక్కసారి నువ్వు గెలిచాక చెత్త చెప్పిన అది చరిత్రే" అనే కథాంశం తో రాబోతున్న 'సీతారాం సిత్రాలు' సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలో థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో లక్ష్మణ్ మాట్లాడుతూ.. 'కొత్త కథ, కథనాలు ఉన్న సినిమాల్లో నటించాలని ఉంది, 'సీతారాం సిత్రాలు' అందరిని అలరించే ఒక మంచి సినిమా అవుతుందనే నమ్మకం ఉందని చెప్పాడు.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున!)
Comments
Please login to add a commentAdd a comment