ప్రకతి వ్యవసాయ శిక్షణకు రెతులు
-
ప్రత్యేక వాహనం జెండా ఊపి ప్రారంభించిన జేడీఏ
నెల్లూరు రూరల్ :
తిరుపతిలో జరిగే నాలుగు రోజుల పెట్టుబడి లేని ప్రకతి వ్యవసాయ శిక్షణ జిల్లా నుంచి రైతులు, వ్యవసాయాధికారులు శనివారం బయలు దేరారు. స్థానిక మినీబైపాస్‌రోడ్డులో వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనాలను జేడీఏ కె.హేమమహేశ్వరరావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. చిత్తూరు జిల్లా, తిరుపతి నగరంలోని డాక్టర్ రామానాయుడు కల్యాణ మండపంలో ఈనెల 11వ తేదీ నుంచి 14 వరకు పద్మశ్రీ సుభాష్ పాలేకర్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నుంచి 300 మంది రైతులను, 100 మంది వ్యవసాయ అధికారులను, 8 ప్రత్యేక బస్సుల్లో పంపినట్లు చెప్పారు. కార్యక్రమంలో ప్రకతి వ్యవసాయం ప్రాజెక్టు మేనేజర్ రవిచంద్ర ప్రసాద్, ఏడీఏలు, ఏఓలు, రైతులు పాల్గొన్నారు.