
ప్రతిపక్ష ఎమ్మెల్యేకు గుర్తింపు ఉండదా ?
రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి
బొబ్బిలి: టీడీపీ ప్రభుత్వం తమ పార్టీ కార్యకర్తలకు ఇచ్చిన గౌరవం కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఇవ్వడంలేదని రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్ముంనాయుడు అన్నారు. ఆయన ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు గుర్తింపు ఉండదా.. అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీల్లో ఎమ్మెల్యేలకు కాకుండా పార్టీ కార్యకర్తలను చైర్మన్లుగా ప్రభుత్వం నియమిస్తోందిని చెప్పారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి కమిటీతో కార్యకర్తలకు పనులు కట్టబెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కోర్టును ఆశ్రయించి జన్మభూమి కమిటీలను రద్దు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో సంఘ నాయకులు బెల్లాన రామినాయుడు, పాలవలస సూర్యనారాయణ తదతరులు పాల్గొన్నారు.