హైకోర్టు ఉత్తర్వుల మేరకు రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందే లా చూడాలని రైతు సంఘాల ప్రతినిధులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం వారు బాధిత కుటుంబాలతో కలెక్టర్ దినకర్‌బాబును కలిసి సమస్యను విన్నవించారు.
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: హైకోర్టు ఉత్తర్వుల మేరకు రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలకు సత్వర న్యాయం అందే లా చూడాలని రైతు సంఘాల ప్రతినిధులు కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. శనివారం వారు బాధిత కుటుంబాలతో కలెక్టర్ దినకర్‌బాబును కలిసి సమస్యను విన్నవించారు. పునర్విచారణలో జరుగుతున్న జాప్యాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ‘అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతు బాధి త కుటుంబాలకు ఆర్థిక సాయం అందేలా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జీఓ 421 జారీ చేశారు. అయితే క్షేత్ర స్థాయికి వెళ్లకుండానే మండల, డివిజన్ స్థాయి విచారణ కమిటీలు ప్రతికూల నివేదికలు సమర్పిస్తున్నాయి. రైతు ఆత్మహత్య ఘటనపై పునర్విచారణ జరపాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
సంగారెడ్డి డివిజన్‌లో పునర్విచారణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. గతంలో ఇచ్చిన నివేదికలను మరోమారు అధికారులు సమర్పించి చేతులు దులుపుకుంటున్నారు’ అంటూ రాష్ట్ర ఉద్యాన మిషన్ బోర్డు సభ్యులు పి.శ్రీహరిరావు కలెక్టర్ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. విచారణకు వెళ్లే సందర్భంలో బాధిత కుటుంబాలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు. సదాశివపేట, మునిపల్లి నుంచి వచ్చిన బాధిత కుటుంబాలు కలెక్టర్ ఎదుట తమ గోడు వెల్లబోసుకున్నాయి. నెల రోజు ల్లోగా పునర్విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో రైతు సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షులు కె.నర్సింహరామశర్మ, ఉపాధ్యక్షుడు రాఘవేం దర్‌రెడ్డి, మంజీర రైతు సంఘాల సమాఖ్య అధ్యక్షుడు పృథ్వీరాజ్ ఉన్నారు.