సిద్దిపేట కలెక్టర్‌కు నోటీసులు
కోర్టు ధిక్కార కేసులో హైకోర్టు తీర్పు
సాక్షి, హైదరాబాద్: కోర్టు ధిక్కార కేసులో సిద్దిపేట జిల్లా కలెక్టర్ పి.వెంకట్రామిరెడ్డి, ఆర్డీవో ముత్యంరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులుకు హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. కోర్టు ఉత్త ర్వులను ఎందుకు ఉల్లంఘించారో వివరించాలని ఆదేశించింది. విచారణను న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్ 4 వారాలకు వాయిదా వేశారు. సిద్దిపేట జిల్లా నర్సాపురంలోని తమ భూముల నుంచి తమను ఖాళీ చేయించడాన్ని సవాల్ చేస్తూ ఆర్.నాగేశ్వర్, మరో ఐదుగురు హైకోర్టును ఆశ్రయించారు.
అధికారులు చట్ట విరుద్ధంగా ఖాళీ చేయించారని, కనీసం నోటీసు కూడా జారీ చేయలేద న్నారు. దీంతో ఈ భూముల విషయంలో యథాతథస్థితి కొనసాగించాలంటూ 2016లో కోర్టు మధ్యంతర ఉత్త ర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులు అమల్లో ఉండగానే ఈ నెల 8న పౌలోమీ ఇన్‌ఫ్రా వ్యక్తులు సరిహద్దు రాళ్లను కూల్చేశారని, దీన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని నాగేశ్వర్ తదితరులు జిల్లా అధికార యంత్రాంగంపై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన ధర్మాసనం ఈ మేరకు నోటీసులు జారీ చేసింది.
‘ఎస్సీ అభివృద్ధి శాఖకు రెవెన్యూ ఉద్యోగులొద్దు’
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ అభివృద్ధి శాఖలో రెవెన్యూ శాఖకు చెందిన వారికి డిప్యూటీ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇవ్వడంపై రాష్ట్ర అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరిం చుకోవాలని కోరింది. ఈ మేరకు సంఘ అధ్యక్ష, కార్యదర్శులు యూసూఫ్ అలీ, వినోద్‌కుమార్ బుధవారం రాష్ట్ర సీఎస్ ఎస్‌పీ సింగ్‌కు వినతిపత్రం అందజేశారు.