కనిగిరి: సకాలంలో వర్షాలు కురిసి రైతులందరూ ఆనందంగా ఉండాలని కాంక్షిస్తూ తాను రైతు సుభిక్ష యాత్ర చేపట్టినట్లు మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చెప్పారు. ఉగ్ర సేన రైతు సంఘం ఆధ్వర్యంలో గురువారం రైతు సుభిక్ష యాత్ర ప్రారంభించారు. ఈ పాదయాత్రకు పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉగ్ర మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు పనులు త్వరతగతిన పూర్తి కావాలని, కనిగిరి నియోజకవర్గ ప్రజలకు తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కారం కావాలని కోరుతున్నట్లు తెలిపారు.
ముందుగా పట్టణంలోని సాయిబాబా దేవస్థానంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కనిగిరి నుంచి ఎన్ గొల్లపల్లి మీదుగా వెలిగండ్ల మండలం వైపు పాదయాత్ర సాగింది. కార్యక్రమంలో సింగిల్ విండో అధ్యక్షుడు బుడేసా, జిల్లా కోఆప్షన్ మాజీ సభ్యుడు షరీఫ్, ఏఎంసీ మాజీ డైరక్టర్లు సుందరరాజ, బొట్టు శ్రీను, పెన్నా రెండో నాగయ్య, వెంకట్రావు, జంషీర్, గౌస్‌బాషా, రీటా ఫయాజ్, కరీముల్లా, ఉండేల పిచ్చిరెడ్డి, ఉగ్రసేన నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment