ఆదిలాబాద్(నార్నూర్): యూరియా కోసం రైతులు బారులు తీరారు. సరఫరా సరిగా లేకపోవడంతో ఆదిలాబాద్ జిలా నార్నూర్ మండల కేంద్రంలో ఆదివారం రైతులు ఆందోళనకు దిగారు. డిమాండ్‌కు సరిపడా సరఫరా లేకపోవడంతో రైతులు ఆగ్రహించి అధికారుల తీరుకు నిరసనగా పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. మండలంలో పత్తి, సోయా పంటలను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. ఈ పంటకు ప్రస్తుతం సీజన్‌లో యూరియా అవసరం ఎక్కువగా ఉంది. అయితే అందుకు సరిపడా సరఫరా చేసేందుకు వ్యవసాయ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.