కురవి మండలకేంద్రంలోని ఖమ్మం ప్రధాన రహదారిలో కల్ల పెద్దిరెడ్డి అనే రైతుఇంట్లో దొంగలు పడ్డారు.
కురవి మండలకేంద్రంలోని ఖమ్మం ప్రధాన రహదారిలో కల్ల పెద్దిరెడ్డి అనే రైతుఇంట్లో దొంగలు పడ్డారు. ఇంట్లో మనుషులు లేని సమయం చూసి గుర్తుతెలియని వ్యక్తులు గడ్డపారతో గొళ్లెం తొలగించారు. ఇంట్లో దాచిన 18 తులాల వెండిపట్టీలు, రూ.15 వేల నగదు, రూ.25 వేల విలువ చేసే బంగారు గొలుసు తస్కరించారు. చోరీ జరిగిన సమయంలో ఇంట్లో వాళ్లు పొలంలో పనికి వెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.