కబ్జాకు గురైన మార్కెట్ స్థలం స్వాధీనం
శంకర్‌పల్లి: రైతుల సంక్షేమమే తమ లక్ష్యమని వారి కోసం నిరంతరం పాటు పడుతామని శంకర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్‌యాదవ్ తెలిపారు. శంకర్‌పల్లి మార్కెట్ కమిటీ సమీపంలో సర్వే నెంబర్196/ఎలో కొంత భాగం కబ్జాకు గురెంది దానిని బుధవారం పాలకమండలి సభ్యులు అందరూ కలిసి స్వాధీనం చేసుకొని సంతను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక వ్యవసాయ మా ర్కెట్ కమిటీలో మొత్తం 7ఎకరాల30 గుంటల భూమి ఉందని అన్నారు. కాగా కొంత మంది అక్రమార్కులు మార్కెట్ కమిటీ స్థలాన్ని ఆక్రమించుకున్నారు. భూమిని స్వాధీనం చేసుకొని అక్కడ పశువుల సంతను ఏర్పాటు చేశామని తెలిపారు. గ తంలో పశువుల సంత మార్కెట్ ఆవరణలో జరిగేదని దీంతో వ్యాపారులు , రైతులు ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఇప్పుడు స్వాదీనం చేసుకున్న స్థలంలో పశువుల సంతను తరలించడం వలన ఉల్లి వ్యాపారులకు, రైతులకు ఇక్కట్లు తొలి గిపోయాయని అన్నారు.
త్వరలోనే రైతుల కొరకు విశ్రాంతి భవననిర్మాణం చేపడుతామని అందుకు ప్రభుత్వనికి ప్రతిపాదనలు పాలకవర్గం తీర్మాణం చేసి పంపుతామని అన్నారు. మార్కెట్ కార్యదర్శి వెంకటయ్య మాట్లాడుతూ 5నవంబర్ 2015 సంవత్సరంలో ఈ భూమినిమార్కెట్ కమిటీ అధీనంలోకి వచ్చిందని అందుకే స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్, తహసీల్దార్, పోలీసులు అన్నిరకాలుగా సహకరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ దండురాజేశ్వర్, సర్పంచ్ శ్రీధర్, గుడిమల్కాపూర్ మార్కెట్‌కమిటీ డెరైక్టర్ శేరి అనంత్‌రెడ్డి, మార్కెట్‌కమిటీ డెరైక్టర్‌లు వార్డు సభ్యులు, రైతు సంఘం నాయకులు తదితరులు ఉన్నారు.
రైతుల విజయం...
కబ్జాకుగురైన మార్కెట్ స్థలాన్ని స్వాధీనం చేసుకోవడం రైతుల విజయం అని భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలు రాంరెడ్డి, పాండురంగం, ప్రకాశ్‌చారి అన్నారు. బుధవారం వారు మాట్లాడు తూ మార్కెట్ స్థలం కబ్జాకు గు రైందని ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నామన్నారు.
జేఏసీ చైర్మన్ కోదండరామ్, ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా మంత్రి హరీష్‌రావు, జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి కబ్జాకు గురైన భూమిని స్వాధీనం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారని అన్నారు. అధికారులు వెను వెంటనే రికార్డులు పరిశీలించి స్థలం కబ్జాకు గురైందని గుర్తించి కలెక్టర్ అదేశంతో తిరిగి స్వాధీనం చేసుకు న్నారన్నారు. రెతు సంఘం స హాయకార్యదర్శి దేవిరెడ్డి, జనార్దన్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.