లడ్డు వివాదం.. తిరుమలలో సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు | CPI Narayana Sensational Comments On Tirupati Laddu, Urges Politicians To Stop Politics In This Issue | Sakshi
Sakshi News home page

లడ్డు వివాదం.. తిరుమలలో సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు

Feb 12 2026 10:42 AM | Updated on Feb 12 2026 10:57 AM

CPI Narayana Sensational Comments On Tirupati Laddu

సాక్షి, తిరుమల: తిరుమల లడ్డూపై కూటమి నేతలు వివాదాస్పద​ వ్యాఖ్యలు చేస్తున్న వేళ ఈ వ్యవహారంపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డు వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు.

తిరుమలలో సీపీఐ నారాయణ మాట్లాడుతూ..‘తిరుపతి లడ్డూ వివాదంపై రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలి. తప్పు చేసిన అధికారులను, పాత ఈవోను వదిలేయకూడదు. రాజకీయ లబ్ధి కోసమే అధికార పార్టీ లడ్డుపై రాద్ధాంతం చేస్తున్నాయి. దేవుడిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం సరికాదు. మీ రాజకీయాల కోసం కోట్లాది మంది భక్తులను మనోవేదనకు గురి చేయొద్దు. సుప్రీంకోర్టు విచారణ జరుపుతోంది. ఈ సమయంలో రాజకీయ నేతలు లడ్డుపై మాట్లాడటం ఆపేయాలి. మీ రాజకీయాల కోసం కావాలంటే కొట్టుకోండి.. కానీ దేవుడిని మాత్రం లాగొద్దు. లడ్డు వివాదంపై అనవసర చర్చలు ఆపి, భక్తుల మనోభావాలను కాపాడండి’ అని హితవు పలికారు. 

Advertisement
 
Advertisement
Advertisement