సాక్షి, రంగారెడ్డిజిల్లా/కందుకూరు: ‘ప్రధాని నరేంద్ర మోదీ... నీరవ్‌మోదీ, విజయ్ మాల్యా వంటి వైట్ కాలర్ నేరస్తులను దేశాన్ని దాటించేందుకు సహకరించారు. రాష్ట్రానికి ఒక మెడికల్ కాలేజీ ఇవ్వలేదు.. కేంద్రం సహకరించక పోయినా.. రూపాయి ఇవ్వక పోయినా.. సీఎం కేసీఆర్ 33 జిల్లాలకు 35 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. వైట్‌కోట్ రెవల్యూషన్ సృష్టించారు. వైట్ కాలర్ నేరస్తులను దేశ సరిహద్దులు దాటించిన వాళ్లు కావాలా? వైట్ కోట్ రివల్యూషన్ సృష్టిస్తున్న కేసీఆర్ కావాలా? ప్రజలే తేల్చుకోవాలి’అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో రూ.176 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించతలపెట్టిన మెడికల్ కాలేజీ భవనానికి ఆదివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో హరీశ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే.. రాష్ట్రానికి ఒక్కటి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
అప్పట్లో వారు డాక్టర్ కాలేక బాధపడ్డారు
’’మంత్రి సబితమ్మ కూడా డాక్టర్ కావాలనుకున్నారట, ఆనాడు ఎంసెట్ రాస్తే 1200 ర్యాంకు రాగా సీటు రాకపోవడంతో డాక్టర్ కాలేక ఎంతో చింతించారట.. అలాగే ఎంపీ రంజిత్‌రెడ్డి కూడా ఆశయం నెరవేరక చాలా బాధపడ్డారట. కానీ ఇప్పుడు మన తెలంగాణలో లక్షాయాభై వేల ర్యాంకు వచ్చినా సీటు లభిస్తోంది. తక్కువ ఖర్చుతో పిల్లలకు ఎంబీబీఎస్ చదువుకునే అవకాశం లభించింది’’అని హరీశ్‌రావు చెప్పారు.
కాంగ్రెస్‌ను నమ్మితే మళ్లీ అంధకారమే..
బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వాళ్లు గెలిస్తే రాష్ట్రం మరోసారి అంధకారమే అవుతుందన్నారు.
జల్‌పల్లి, ఆమనగల్లు మున్సిపాలిటీల పరిధిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి సబితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం, జెడ్పీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల శాఖ చైర్‌పర్సన్ రజనీసాయిచంద్ తదితరులు పాల్గొన్నారు.
ఎవరు కావాలో ప్రజలే తేల్చుకోవాలి
Published Mon, Oct 2 2023 4:12 AM | Last Updated on Mon, Oct 2 2023 4:12 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment