సాక్షి,హైదరాబాద్ : రూ.100 కోట్ల నిధులు వెనక్కి ఇస్తున్నారు సరే.. అదానీతో కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన రూ.100 కోట్ల నిధులను వెనక్కి ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. రేవంత్ సర్కార్ నిర్ణయంపై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు.
‘‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్‌రెడ్డి .. మరి, రాహుల్ గాంధీ అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్ లో మీరు ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేమిటి?
అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి?. 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడుతామనే ప్రతిపాదనతో వస్తే, మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేశాం. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది.
ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆదానితో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఆదాని అవినీతి బయటికిరాగానే మాట మార్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్‌లో హరీష్ రావు స్పష్టం చేశారు.
యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారూ...
మరి, రాహుల్ గాంధీ గారు అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్ లో మీరు ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల… pic.twitter.com/XuxVIF7IgM— Harish Rao Thanneeru (@BRSHarish) November 25, 2024
Comments
Please login to add a commentAdd a comment