లడ్డూ లాక్కెళ్లి... పిప్పర్‌మెంట్‌ ఇచ్చారు | Ministers and BRS leaders fires on Prime Minister Modi | Sakshi
Sakshi News home page

లడ్డూ లాక్కెళ్లి... పిప్పర్‌మెంట్‌ ఇచ్చారు

Jul 9 2023 2:39 AM | Updated on Jul 9 2023 2:39 AM

Ministers and BRS leaders fires on Prime Minister Modi - Sakshi

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వరంగల్‌ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన విమర్శల మీద బీఆర్‌ఎస్‌ మంత్రులు, పార్టీ నేతలు తీవ్రంగా స్పందించారు. మోదీ విమర్శ లను తిప్పికొట్టారు. రాష్ట్రంలో అభివృద్ధిని, సీఎం కేసీఆర్‌కు వస్తున్న ఆదరణను చూసి కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ ఓర్వలేకపోతోందని మండిపడ్డారు. నేతల విమర్శలు వారి మాటల్లోనే.. 

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి/సాక్షి, హైదరాబాద్‌/ సూర్యాపేట/మిర్యాలగూడ: ప్రధాని మోదీ తెలంగాణకు రావాల్సిన కోచ్‌ ఫ్యాక్టరీని గుజరాత్‌కు తరలించి, రాష్ట్రానికి వ్యాగన్‌ యూనిట్‌ ఇచ్చారు. ఇది లడ్డూను గుజరాత్‌కు లాక్కెళ్లి, పిప్పర్‌మెంట్‌ తెలంగాణ చేతిలో పెట్టినట్టు ఉంది. మోదీ రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా తెలంగాణ సర్కారుపై బురద చల్లుతూ, బద్నాం చేయడం పరిపాటిగా మారింది.

మహాభారతంలో కౌరవులపై పాండవులు గెలిచినట్టే, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కౌరవులపై తెలంగాణ ప్రభుత్వమే విజయం సాధిస్తుంది. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుంటే కేంద్రంలోని బీజేపీ కళ్లల్లో నిప్పులు పోసుకుంటోంది. సీఎం కేసీఆర్‌ లేవనెత్తిన కిసాన్‌ ఎజెండాతో కాంగ్రెస్, బీజేపీలకు పరేషాన్‌ పట్టుకుంది. తెలంగాణలో అభివృద్ధి జరగకపోతే కేంద్రం రాష్ట్రానికి అవార్డులు ఎలా ఇస్తోంది. 

ఢిల్లీలో అవార్డులు ఇచ్చి.. గల్లీలో విమర్శలు చేస్తున్నారు. కేసీఆర్‌ అమలు చేస్తున్న రైతుబంధు, మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ వంటి పథకాలను కేంద్రం కాపీ కొట్టింది. కేసీఆర్, అధికారుల పనితనంతోనే తెలంగాణకు పెట్టుబడులు వస్తున్నాయి. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను ఏపీలో కలిపి, కేంద్రంలోని బీజేపీ సర్కారు రాష్ట్రానికి అన్యాయం చేసింది.

లోయర్‌ సీలేరు ప్రాజెక్టు రాష్ట్రానికి లేకుండా చేశారు. రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన రూ.లక్ష కోట్లు ఇవ్వకుండా మోదీ, తెలంగాణపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్నారు. నీతి ఆయోగ్‌ చెప్పినా నిధులు ఇవ్వడం లేదు. రాష్ట్రానికి వెంటనే బయ్యారం ఉ క్కు ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీని మంజూరు చేయాలి. – మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో పోడుపట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు 

ప్రధాని దిగజారి మాట్లాడటం విచారకరం
విభజన హామీలను అమలు చేయకుండా సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై నిందలు, అసత్య ప్రచారాలు చేయడం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి తగదు. మోదీ దిగజారి మాట్లాడటం విచారకరం. విభజన చట్టంలో పొందుపరిచిన విధంగా తెలంగాణకు రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ ఇవ్వకుండా ఏ ముఖం పెట్టుకొని వరంగల్‌కు వచ్చారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయహోదా ప్రకటించకుండా ప్రజలను మోసం చేసిన ఘనత బీజేపీది.  – శాసన మండలి చైర్మన్‌  గుత్తా సుఖేందర్‌రెడ్డి

దేశాన్ని తాకట్టు పెట్టినఘనుడు మోదీ
ప్రధాని హోదాలో ఉన్న మోదీ తన స్థాయిని తగ్గించుకొని అబద్ధాలు చె ప్పారు. మరోసారి తెలంగాణ మీద, సీఎం కేసీఆర్‌ మీద మోదీ తన అక్క సు వెళ్లగక్కారు. అవినీతిలో బీజేపీ, కాంగ్రెస్‌ని మించిపోయింది. తమ బండారం ఎక్కడ బయటపడుతుందోననే భయంతోనే కేసీఆర్‌ కుటుంబంపై మోదీ అవాకులు, చవాకులు పేలు తున్నారు. కొద్ది మంది కోసం దేశాన్ని తాకట్టు పెట్టి న ఘనుడు ప్రధాని మోదీ. – మంత్రి జగదీశ్‌రెడ్డి

తెలంగాణపై విషం కక్కారు.. 
వరంగల్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణపై విషం కక్కారు. రాష్ట్రంలో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టకుండా, చిన్న రిపేర్‌ కంపెనీతో సరిపెట్టారు. 80 కోట్ల మంది బీసీలు ఉన్న భారతదేశంలో వారికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. అవినీతి జరిగే తెలంగాణలో అద్భుత ప్రగతి ఎలా సాధ్యమైంది.    – మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌

స్థాయిని మరచిన ప్రధాని..
దేశానికి ప్రధాని అనే విషయాన్ని మరచి నరేంద్ర మోదీ.. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ఆరోప ణలు చేశారు. సీఎం కేసీఆర్‌ను తిట్టడానికే ప్రధాని వరంగల్‌ వచ్చినట్టు ఉంది. ప్రజల సమస్యలు, డిమాండ్లపై ఓ గ్రామ సర్పంచికి ఉండే కనీస అవగాహన కూడా ప్రధానికి లేకపోవడం విచారకరం. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సిన మెడికల్‌ కాలేజీలు, మెట్రో రైల్‌ కోసం నిధులు ఏమయ్యాయి.    – మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి 

తెలంగాణ అభివృద్ధికి మోదీ ఏం చేశారో చెప్పాలి
తెలంగాణ అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం చేశారో ముందు చెప్పాలి. మోదీ ప్రసంగం అయోమయం, అందోళనకరంగా ఉంది. దేశంలో బీఆర్‌ఎస్‌కు వస్తున్న ఆదరణ తట్టుకోలేక, రాష్ట్రంలో ఓడిపోతామన్న భయంతో మోదీ విమర్శలు చేస్తున్నారు.  – మంత్రి సత్యవతి రాథోడ్‌ 

నియంతలా పాలించాలన్నదే మోదీ లక్ష్యం 
నియంతలా పాలించాలన్నదే మోదీ లక్ష్యం. రాష్ట్రానికి ద్రోహం చేస్తున్న బీజేపీ నేతలను నిల దీయాలి. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌కు వస్తున్న ఆదరణ చూసి మోదీ ఓర్వలేక పోతున్నా రు.   – ఎంపీ బి.వెంకటేశ్‌ నేత, చీఫ్‌ విప్‌ భానుప్రసాద్‌ 

ఎన్నికలకు ముందే ఓటమిని అంగీకరించిన మోదీ 
ఎన్నికలకు ముందే మోదీ రాష్ట్రంలో బీజేపీ ఓటమి ని అంగీకరించారు. ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పర్యటనల సందర్భంగా భారీగా నిధులు ఇచ్చి, హామీలు కురిపించే మోదీ.. వరంగల్‌ సభలో ఒక్క రూపాయి కూడా ప్రకటించ లేదు. ఉద్యోగాల కామ న్‌ రిక్రూట్‌మెంట్‌ బిల్లును గవర్నర్‌ చేత తొక్కిపెట్టించి, వర్సిటీలలో ఉద్యోగాలు భర్తీ చేయ డం లేదని మోదీ చెప్పడం విడ్డూరంగా ఉంది.      – రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement