బెంగళూరు: సమాజంలో గత ఏడాది కాలంగా అంతిమ సంస్కారాల తీరే మారిపోయింది. కరోనా విలయతాండవం చేస్తున్న వేళ.. మానవత్వం మంటగలుస్తోంది. మృతదేహాలకు అంత్యక్రియలు ప్రసహనంగా మారింది. అయితే ఈ విపత్కర పరిస్థితిలో ఎంతో మంది తమ వంతు బాధ్యతగా సేవ చేస్తున్నారు. అందరినీ చేరుకోలేకపోయినా అందుబాటులో ఉన్న కొంతమందికి ’’హియర్ ఐ యామ్’’ అని సహాయ పడుతూ మానవత్వాన్ని చాటుతున్నారు. కోవిడ్ మృతుల కుటుంబ సభ్యులకు సహాయం చేయడానికి బెంగళూరు ఆర్చ్ డియోసెస్ ఆధ్వర్యంలో "కోవిడ్ లాస్ట్ రైట్స్ అండ్ ఫ్యూనరల్ స్క్వాడ్" బృందాన్ని ఏర్పాటు చేసింది.
1400 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు
కరోనా వైరస్ కారణంగా బెంగళూరులో చాలా మంది తమ ప్రాణాలను కోల్పోయారు. కరోనా మొదటి సెకండ్ వేవ్‌లో ’’హియర్ ఐ యామ్’ అనే బెంగళూరుకు చెందిన బృందం 1400 మృతదేహాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించి మానవత్వం చాటుకుంది. ఒక్క సెకండ్ వేవ్‌లోనే 800 మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. హియర్ ఐ యామ్ అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ మాట్లాడుతూ.. 60 నుంచి 70 మంది వాలంటీర్లను ఓ నాలుగు జోన్లుగా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ వాలంటీర్లు వేర్వేరు శ్మశానవాటికలలో ఉంటారని పేర్కొన్నారు. ఇక పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్) కిట్‌లను ఎలా వాడాలి అనే దానిపై శిక్షణ తీసుకున్నామని వివరించారు. కోవిడ్‌తో మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఎలా తాకాలి, దూరం ఎలా ఉంచుకోవాలి అనే వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉన్నట్లు చెప్పారు.
స్వచ్ఛందంగా ముందుకు
ఎరరైనా కోవిడ్‌తో చనిపోతే ఆ మృతదేహాలను ప్యాక్ చేయడానికి, ఆస్పత్రులు, ఇంటి నుంచి మృతదేహాలను తరలించడానికి వారు స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. తేకాకుండా ఉచితంగా అంబులెన్స్ సేవలను అందిస్తున్నారు. ఇక ఎవరైనా పేదవాళ్లు ఉంటే ఉచితంగా శవపేటిక ఇచ్చి, సమాధి తవ్విన వారికి చెల్లిస్తున్నారు. అంతే కాకుండా కరోనా మృతదేహాలను తరలించేందుకు సహాయపడుతూ శ్మశాన వాటికల్లో చివరి కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు.
చదవండి: దారుణం: నాలుగేళ్లుగా ఆశ్రమంలోని పిల్లలపై లైంగిక వేధింపులు
Comments
Please login to add a commentAdd a comment