
మృతుని తల్లి
చత్తీస్‌ఘడ్ : దహన సంస్కారాలకు డబ్బుల్లేక కొడుకు శవాన్ని మెడికల్ కాలేజీకిచ్చేసింది ఓ తల్లి. ఈ హృదయ విచారక ఘటన చత్తీస్‌ఘడ్‌లోని బాస్తర్‌లో చోటు చేసుకుంది. గత సోమవారం బామన్ అనే 21 ఏళ్ల యువకుడిని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని సొంత ఊరికి తీసుకెళ్లి దహన సంస్కారాలు నిర్వహించడానికి డబ్బుల్లేకపోవడంతో చేసేదేమి లేక జగ్దాల్‌పూర్ మెడికల్ కాలేజీకి డొనేట్ చేశారు.
‘మేము చాలా పేదోళ్లమని, శవాన్ని తీసుకుపోయే స్థోమత తమకు లేదని, మెడికల్ కాలేజీకివ్వమని ఒకరు సలహా ఇవ్వడంతో ఇలా చేశానని’ ఆతల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరు సాయం చేయడానికి ముందుకు రాలేదని మృతుడి కుటుంబ సభ్యులు ఒకరు పేర్కొన్నారు. వారు చాలా పేదవారని, శవం కావాలంటే తీసుకోవాలని వారు కోరినట్లు మెడికాలేజి మార్చురి ఇన్ చార్జ్ పేర్కొన్నారు.