విజయవాడ: అధికార లాంఛనాలతో మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) అంత్యక్రియలు మంగళవారం ముగిశాయి. గుణదలలోని ఆయన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు అంత్యక్రియలకు హాజరయ్యారు. అంతకు ముందు దేవినేని నివాసం నుంచి అంతియ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పార్టీ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా దేవినేని నెహ్రు గుండెపోటుతో సోమవారం హైదరాబాద్‌లో మరణించిన విషయం తెలిసిందే.
దేవినేని నెహ్రూ అంత్యక్రియలు పూర్తి
Published Tue, Apr 18 2017 11:40 AM | Last Updated on Tue, Sep 5 2017 9:05 AM
Advertisement
Advertisement