అనారోగ్యంతో మృతిచెందిన వ్యక్తి కుమారుడు దూరప్రాంతంలో ఉండడంతో భార్య అంత్యక్రియలు నిర్వహించిన ఘటన పలువురి కంట తడిపెట్టించింది.
వజ్రపుకొత్తూరు: అనారోగ్యంతో మృతిచెందిన వ్యక్తి కుమారుడు దూరప్రాంతంలో ఉండడంతో భార్య అంత్యక్రియలు నిర్వహించిన ఘటన పలువురి కంట తడిపెట్టించింది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం డోకులపాడులో దాసరి జంగమయ్య (71) అనారోగ్యంతో గురువారం వేకువజామున మృతిచెందారు.
కోల్‌కతలో ఉద్యోగం చేస్తున్న అతడి కుమారుడు దాసరి హరి అనారోగ్యంతో ఉన్న తండ్రిని చూసేందుకు వచ్చి బుధవారం సాయంత్రమే తిరిగి వెళ్లారు. ఇంతలోనే జంగమయ్య మృతి చెందటం, కుమారుడు అందుబాటులో లేకపోవటంతో జంగమయ్యకు భార్య చినపిల్లమ్మ అంత్యక్రియలు నిర్వహించింది.