Ramesh Babu Last Rites Performed In Mahaprasthanam At Jubilee Hills - Sakshi
Sakshi News home page

Ramesh Babu : ముగిసిన అంత్యక్రియలు.. కోవిడ్‌ కారణంగా హాజరు కాని మహేశ్‌

Published Sun, Jan 9 2022 3:16 PM | Last Updated on Sun, Jan 9 2022 9:45 PM

Ramesh Babu Last Rites Performed In Maha Prasthanam - Sakshi

Ramesh Babu Last Rites Performed In Maha Prasthanam: సూపర్‌స్టార్‌ కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్‌ బాబు (56)అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‏లోని మహాప్రస్థానంలో  అంతిమ సంస్కారాలు జరిగాయి. రమేశ్‌ బాబు కుమారుడు జయకృష్ణ చితికి నిప్పు పెట్టి తుది వీడ్కోలు పలికారు. కోవిడ్‌ నిబంధనలతో అతికొద్దిమందితో అంత్యక్రియలు పూర్తి చేశారు.

నటుడు నరేష్‌, తమ్మారెడ్డి భరద్వాజ సహా కొందరు సినీ ప్రముఖులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. కోవిడ్‌ కారణంగా ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న మహేశ్‌ బాబు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు.కాగా కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన  శనివారం(జనవరి 8) రాత్రి కన్నుమూశారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే తుదిశ్వాస విడిచారు. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement