సాక్షి, పులివెందుల: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానుల కన్నీటి వీడ్కోలు నడుమ వైఎస్ వివేకానందరెడ్డి పార్థీవ దేహాన్ని ఖననం చేశారు. పులివెందులలోని వైఎస్ రాజారెడ్డి ఘాట్‌లో శనివారం ఉదయం 11 గంటల ప్రాంత్రంలో వివేకానందరెడ్డి భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులంతా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ‘అజాత శత్రువు’ను కడసారి చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. (అజాత శత్రువుకు కన్నీటి నివాళి)
అంతకుముందు వివేకానందరెడ్డి నివాసం నుంచి రాజారెడ్డి ఘాట్ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. వేలాది మంది అంతిమయాత్రలో పాల్గొన్నారు. అశ్రునయనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. వైఎస్ జగన్ భారీ భద్రత నడుమ తన చిన్నాన్న అంతిమయాత్రలో పాల్గొన్నారు. రెండు చేతులు జోడించి అందరికీ నమస్కరిస్తూ ముందుకు సాగారు. వైఎస్ అవినాష్‌రెడ్డి, కుటుంబ సభ్యులు ఆయన వెంట ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment