అక్కడ శవాలు వెయిటింగ్! | dead bodies wait in queue for last rites in flood hit varanasi | Sakshi
Sakshi News home page

అక్కడ శవాలు వెయిటింగ్!

Published Wed, Aug 24 2016 2:13 PM | Last Updated on Mon, Sep 4 2017 10:43 AM

అక్కడ శవాలు వెయిటింగ్!

అక్కడ శవాలు వెయిటింగ్!

కాశీకి వెళ్లి చనిపోవడం, అక్కడే అంత్యక్రియలు జరిపించుకోవడం చాలా అదృష్టం అంటారు. కానీ, అలాంటిది ఇప్పుడు అక్కడ అంత్యక్రియల కోసం శవాలు వెయిటింగ్ లిస్టులో వేచి చూడాల్సి వస్తోంది. అంత్యక్రియలకు పేరొందిన మణికర్ణికా ఘాట్‌తో పాటు దానికి దారితీసే వీధులన్నీ కూడా భారీ వరదలతో జలమయం అయ్యాయి. దాంతో ఎత్తుగా ఉన్న ప్లాట్‌ఫారాల మీద మాత్రమే శవ దహనాలు జరుగుతున్నాయి. అక్కడి వరకు మృతదేహాలను తీసుకెళ్లేందుకు బోట్లను అద్దెకు తీసుకోవాల్సి వస్తోంది. ప్రతిరోజూ ఇక్కడకు 75-100 మృతదేహాలు వస్తుంటాయని, కానీ ఇక్కడ ఒకసారి ఆరింటిని మాత్రమే దహనం చేయగలమని అక్కడి కాటికాపరి చెప్పారు.

దాంతో మృతదేహాలను షిఫ్టులలో దహనం చేయాల్సి వస్తోందన్నారు. ఒక్కో శవం పూర్తిగా కాలడానికి కనీసం రెండు నుంచి రెండున్నర గంటల సమయం పడుతుందని, అందువల్ల మిగిలిన శవాలఉ వెయిటింగ్ లిస్టులో ఉంచక తప్పడం లేదని తెలిపారు. తాము గంట నుంచి ప్లాట్‌ఫాం వద్దే వేచి ఉన్నామని, తమ వంతు వచ్చేసరికి ఎంత సమయం పడుతుందో చెప్పలేమని తమ బంధువు శవాన్ని తీసుకుని వచ్చిన ప్రేమ్‌చంద్ శ్రీవాత్సవ అనే వ్యక్తి చెప్పారు. వరదలు ఎక్కువగా ఉండటంతో మృతుల బంధువులు కూర్చోడానికి కూడా స్థలం దొరకట్లేదట.

శవాలను కాల్చడానికి ఉపయోగించే కట్టెల నుంచి మొత్తం అన్ని సామాన్ల రేట్లు కూడా ఒక్కసారిగా పెరిగిపోయాయి. ప్లాట్‌ఫాం వరకు మృతదేహాలను తీసుకురావడానికి పడవల వాళ్లు వంద రూపాయలు వసూలు చేస్తున్నారు. కట్టెల వ్యాపారులు కూడా గడ్డుకాలమే ఎదుర్కొంటున్నారు. ప్లాట్‌ఫారాల వరకు కట్టెలు తీసుకెళ్లడానికి బోట్లు కూడా ఉండట్లేదు. దానికి తోడు.. చాలావరకు కట్టెలు వరద నీటితో తడిసిపోయాయి. దాంతో తమ కడుపు నింపుకోవడం కూడా కష్టంగా మారిందని వాపోతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement