
సిడ్నీ: ఆస్ట్రేలియా దేశవాళీ మ్యాచ్‌ల్లో భాగంగా న్యూ సౌత్‌వెల్స్ క్రికెటర్ మికీ ఎడ్వర్డ్స్ తృటిలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎడ్వర్డ్స్ వేసిన బంతిని క్వీన్‌లాండ్స్ బ్యాట్స్‌మన్ సామ్యూల్ హీజ్‌లెట్ స్టైట్ డ్రైవ్ కొట్టాడు. దీన్ని ఎడ్వర్డ్స్ ఆపడానికి యత్నించే క‍్రమంలో తల పక్క నుంచి దూసుకుపోయింది. తన చేతిని అడ్డం పెట్టుకోవడంతో తీవ్ర గాయమైంది.
అదే బంతి తలకు తగులుంటే పెద్ద ఘోరమే జరిగేదని విశ్లేషకులతో పాటు అభిమానులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎడ్వర్డ్స్ తృటిలో ఒక భయానక క్షణం నుంచి బయటపడ్డందుకు ఆ దేవునికి ధన్యవాదాలు చెప్పాలని క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. మికీ ఎడ్వర్డ్స్ ఆ బంతిని తప్పించుకునే క్రమంలో నాన్ స్టైకర్ ఎండ్‌లో ఉన్న లబూషేన్ భయాందోళనకు గురయ్యాడు. గతంలో ఆసీస్ క్రికెటర్ హ్యూజ్ తలకు బంతి తగిలి మృతి చెందగా, ఇటీవల యాషెస్ సిరీస్ ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ తీవ్రంగా గాయపడ్డాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతి మెడ వెనుక భాగంలో బలంగా తగలడంతో ఫీల్డ్‌లో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత అతను తేరుకోవడంతో ఆసీస్ మేనేజ్‌మెంట్ ఊపిరిపీల్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment